స్కూళ్లు డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు బంద్‌….

హైద‌రాబాద్ః మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో డిసెంబ‌ర్‌31 వ తేదీ వ‌ర‌కు స్కూళ్ల‌ను మూసివేయ‌నున్నారు. బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో న‌డిచే పాఠ‌శాల‌ల‌ను డిసెంబ‌ర్‌31వ‌ర‌కు మూసివేస్తున్న‌ట్లు ముంబై మేయ‌ర్ కిశోరి ప‌డ్నేక‌ర్ తెలిపారు. కోవిడ్ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో స్కూళ్ల‌ను తెర‌వ‌డం లేద‌న్నారు. వాస్త‌వానికి సోమ‌వారం నుంచి ముంబైలో స్కూళ్ల‌ను తిరిగి ఓపెన్ చేయాల్సిఉన్న‌ది. అయితే బీఎంసీ ప‌రిధిలో ఉండే స్కూళ్ల‌కు మాత్రం ఆంక్ష‌ల‌ను పెంచేశారు. తాజాగా ముంబైలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ముంబై మేయ‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్న‌ట్లు నవంబ‌ర్ 23వ తేదీన స్కూళ్ల‌ను తెర‌వ‌డం లేద‌ని మేయ‌ర్ ఇవాళ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *