ఈ ఏడాది పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ర‌ద్దు…

హైద‌రాబాద్ః ఈ సంవ‌త్స‌రం శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు నిర్వ‌హించ‌డం లేదు. నోవెల్ క‌రోనా వైర‌స్ కేసులు ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను ర‌ద్దు చేసేందుకు అన్ని పార్టీలు అంగీక‌రించిన‌ట్లు పార్ల‌మెంటరీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి తెలిపారు. కోవిడ్ వ్యాప్తి అడ్డుకునేందుకు నేరుగా జ‌న‌వ‌రిలో బ‌డ్జెట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశాల‌ను నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ డిమాండ్ చేస్తూ లేఖ రాసిన నేప‌థ్యంలో మంత్రి ప్ర‌హ్లాద్ జోషి దీనిపై క్లారిటీ ఇచ్చారు. అన్ని పార్టీల ఆమోదించిన‌ట్లు మంత్రితెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *