జ‌మిలీ ఎన్నిక‌ల‌పై ఎలాంటి చ‌ర్చా అవ‌స‌రం లేదు…

న్యూఢిల్లీః రాజ్యాంగ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జ‌మిలీ ఎన్నిక‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌మిలీ ఎన్నిక‌ల‌పై ఎలాంటి చ‌ర్చా అవ‌ర‌సం లేద‌ని, అయితే దేశానికి మాత్రం అవి అత్యంత ఆవ‌శ్య‌క‌మ‌ని నొక్కి వ‌క్కానించారు. అసెంబ్లీ,స్థానిక సంస్థ‌లు, లోక‌స‌భ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం వేర్వేరు ఓట‌రు జాబితాల‌ను రూపొందిస్తోందని, అలా రూపొందించ‌డం అంటే వ‌న‌రుల‌ను వృథా చేయ‌డ‌మే అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. 80వ ఆలిండియా ప్రిసైడింగ్స్ ఆఫీస‌ర్స్ జాతీయ స‌ద‌స్సును ప్ర‌ధాని మోదీ శుక్ర‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జ‌మిలీ ఎన్నిక‌ల‌పై చ‌ర్చ అవ‌స‌రం దేశానికి అవి అత్యంత ఆవ‌శ్య‌కం.కొన్ని నెల‌ల వ్య‌త్యాసాల్లోనే దేశంలో ఎక్క‌డోఒక చోట ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉంటున్నాయి. దీంతో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంద‌న్న విష‌యం ప్ర‌జానీకానికి అర్థ‌మ‌వుతూనే ఉంది. ఈ స‌మ‌స్య‌ను అధ్య‌య‌నం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. దీనిపై ప్రిసైడింగ్ అధికారులు త‌గిన మార్గ‌ద‌ర్శ‌నం చేయాల్సిన ఆవ‌శ్య‌కం ఉంది. అని మోదీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *