రైతుల‌కు ఢిల్లీ వాసులు స‌హాయం చేయాలి…

ఢిల్లీఃనూత‌న వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకంగా దేశ రాజ‌ధాని ఢిల్లీ శివారుల్లోని సింఘు, టిక్రి ర‌హ‌దారుల వ‌ద్ద బైఠాయించిన రైతుల‌కు ఢిల్లీ వాసులు స‌హాయం చేయాల‌ని ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అభ్య‌ర్థించారు. అలాగే సాధ్య‌మైనంత త్వ‌ర‌లో వారితో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈరోజు గురునాన‌క్ జ‌యంతి సంద‌ర్భంగా సిక్కుల‌కు వీడియో సందేశం ద్వారా శుభాంకాక్ష‌లు తెలియ‌జేశారు. దేశ రాజ‌ధానిలో నిర‌స‌న వ్య‌క్తం చేస్తోన్న రైతుల కోసం ఢిల్లీ ప్ర‌జ‌లు సాధ్య‌మైనంత‌వ‌ర‌కు త‌మ వంతు సాయం చేయాల‌ని కోరుతున్నా. కేంద్రం వీలైనంత త్వ‌ర‌గా రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి వారి డిమాండ్ల‌కు అంగీక‌రిస్తుంద‌ని నేను ఆశిస్తున్నాను. ఈ చ‌లి వాతావ‌ణంలో వారు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.ఆప్ ఎమ్మెల్యేలు, స‌భ్యులు, వాలంటీర్లు రైతుల‌కు ఆహారం ,వైద్య స‌హాయం ,నీరు ఇలా ఏదోర‌కంగా స‌హాయం చేస్తున్నారు.అనికేజ్రీవాల్ వెల్ల‌డించారు. వ్య‌వ‌సాయం చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పంజాబ్‌, హ‌రియాణా, త‌దిత‌ర రాష్ట్రాల‌కు చెందిన రైతులు గ‌త ఐదు రోజులుగా చ‌లో ఢిల్లీ ఆందోళ‌న‌లో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో రైతు సంఘాల నాయ‌కుల‌తోకేంద్రం చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *