మాస్క్‌లు ధ‌రించ‌ని వారిపై రూ.2 వేలు జ‌రిమాన‌….

హైద‌రాబాద్ః దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ కేసులు అధిక సంఖ్య‌లో పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమ్ ఆద్మీ స‌ర్కార్ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఢిల్లీలో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్‌లు ధ‌రించ‌ని వారిపై రూ2. వేలు జ‌రిమానా విధించ‌నున్నారు. గ‌తంలో రూ.500 ఉన్న ఫైన్‌ను ఏకంగా రెండు వేల‌కు పెంచేశారు. క‌రోనా క‌ల‌వరం నేప‌థ్యంలో ఇవాళ సీఎం కేజ్రీవాల్.. అఖిల ప‌క్ష పార్టీ నేత‌ల‌తో నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. మాస్క్ ధ‌రించ‌ని వారికి రెండు వేలు జ‌రిమానా విధించ‌నున్న‌ట్లు చెప్పారు. కేసులు పెరుగుతుంటే ఎలా మౌనంగా ఉండిపోయార‌ని… ఇవాళ హైకోర్టు కూడా కేజ్రీ స‌ర్కార్‌కు మొట్టికాయలు వేసింది. దీంతో ఆమ్ఆద్మీ ప్ర‌భుత్వం కొర‌డా రుళుపించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న వేళ ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని, ఇప్పుడు రాజ‌కీయాల‌కు తావు లేద‌ని, ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌ను ప‌క్క‌నపెట్టి, ప్ర‌జ‌ల క్షేమం కోసం ప‌నిచేయాలని సీఎం అన్నారు. చాత్‌పూజ‌ను అంద‌రూ సంతోషంగా జ‌రుపుకోవాల‌ని, కానీ ఒకేసారి కొలునులోకి వంద‌ల మంది వ‌స్తే, దాంట్లో ఒక్క‌రికి కోవిడ్ ఉన్నా, అప్పుడు సంక్ర‌మ‌ణ వేగంగా ఉంటుంద‌న్నారు. నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌ని కేజ్రీవాల్ తెలిపారు. కోవిడ్ మ‌హ‌మ్మారి జోరుగా సంక్ర‌మిస్తోంద‌ని, కానీ చాత్‌పూజ సంబ‌రాల‌కు మాత్రం జ‌నం వంద‌ల సంఖ్య‌లో ఒకేసారి కొల‌నులోకి వెళ్ల‌కూడ‌ద‌ని, ఇంట్లోనే అంద‌రూ సెల‌బ్రేట్ చేసుకోవాల‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *