రాహుల్ గాంధీలో ఆస‌క్తి , అభిరుచిలేదు….

హైద‌రాబాద్‌: అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా తాజాగా త‌న రాజ‌కీయ జీవిత స్మృతుల‌కు సంబంధించి ఓపుస్త‌కాన్ని రాశారు. ఎ ప్రామిస్ట్ ల్యాండ్ పేరుతో రిలీజైన తొలి పుస్త‌కంలో..ఒబామా అనేక మంది రాజ‌కీయ నేతల గురించి చ‌ర్చించారు. భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌తో పాటు కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీ గురించి కూడా ఒబామా త‌న పుస్త‌కంలో కొన్ని వ్యాఖ్య‌లు రాశారు. అమెరికా మాజీ ర‌క్ష‌ణ మంత్రి బాబ్ గేట్స్‌, మాజీ భార‌త ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ గురించి కామెంట్ చేశారు. వారిద్ద‌రి మ‌ద్య చాలా స‌మ‌ర‌స్య‌పూర్వ‌క సంవాదం జ‌రిగిన‌ట్లు వెల్ల‌డించారు. అయితే ఆ పుస్త‌కంలోనే రాహుల్ గాంధీ గురించి కూడా ఆయ‌న కామెంట్ చేశారు. రాహుల్ గాంధీ లో అభిరుచి, ఆస‌క్తి లోపించిన‌ట్లు ఒబామా అభిప్రాయ‌ప‌డ్డారు. హోంవ‌ర్క్ చేసిన విధ్యార్థి ఎలా అయితే టీచ‌ర్‌నుఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తారోఅలా రాహుల్ చేష్ట‌లు ఉన్న‌ట్లు ఒబామా త‌న వ్యాసంలో రాశారు. అమెరికా అధ్య‌క్షుడిగా ఒబామా ఉన్న స‌మ‌యంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడిగా ఉన్నారు.2017 డిసెంబ‌ర్‌లో ఇండియాకు వ‌చ్చిన ఒబామాను రాహుల్ క‌లుసుకున్నారు. రాహుల్‌పై ఒబామా చేసిన కామెంట్‌లో అస‌త్యం ఏమీలేద‌ని కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ అన్నారు. రాహుల్ ఇంటెలిజెన్స్ మ‌నం పెద్ద‌గా చ‌ర్చించాల్సిన అవ‌సరం లేద‌ని, ఒబామాలాంటి మేటి వ్య‌క్తి రాహుల్ గురించి అలా కామెంట్ చేస్తే, మ‌నం దాని గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *