మ‌న సేన‌ల నుంచి న‌లుగురు అసువులు బాయ‌డం బాధాక‌రం

అమ‌రావ‌తిః దేశ స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర‌వాదుల‌ను క‌ట్ట‌డిచేసే క్ర‌మంలో మ‌న సేన‌ల నుంచి న‌లుగురు అసువులు బాయ‌డం బాధాక‌రం. దేశ భ‌క్తితో, తెగింపుతో జ‌మ్మూక‌శ్మీర్ మాచిల్ సెక్టార్‌లో వీర సైనికులు చేసిన పోరాటం అంద‌రూ గుర్తుపెట్టుకుంటారు. వారికి నా త‌ర‌పున, జ‌న‌సేన త‌రుపున శాల్యూట్ చేస్తున్నాను అని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. వీర మ‌ర‌ణం పొందిన వారిలో ఉన్న మ‌న తెలుగు రాష్ట్రాల‌కు చెందిన చీక‌ల ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి , ర్యాడా మ‌హేష్ ల ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌చేస్తున్నాను అని ఆయ‌న తెలిపారు. ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి, ర్యాడా మ‌హేష్‌ల కుటుంబాల‌ను అన్ని విధాలా ఆదుకొని, అండ‌గా నిల‌వాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ప్ర‌భుత్వాల‌ను ప‌వ‌న్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *