ట్రంప్‌కు మ‌రో చేదు అనుభ‌వం…..

హైద‌రాబాద్ః అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌విచూసిన రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్‌కు కొద్దిరోజుల్లోనే మ‌రో చేదు అనుభ‌వం ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. త‌న భార్య మెలానియా… డొనాల్డ్ ట్రంప్‌కు విడాకులు ఇచ్చేందుకు సిద్ద‌ప‌డిన‌ట్లు ట్రంప్ మాజీ రాజ‌కీయ స‌హాయ‌కులురాలు ఒమ‌రోసా న్యూమ్యాన్ చెప్పినట్లుగా డెయిలీ మెయిల్ వెల్ల‌డించింది. అయితే ఇందు కోసం మెలానియా నిమిషాల‌ను కౌంట్ చేస్తున్న‌ట్లు పేర్కోంది.వైట్ హౌస్‌ను ట్రంప్ ఖాళీ చేయ‌గానే విడాకులు ఇవ్వాల‌ని మెలానియా నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపింది. 15 సంవ‌త్స‌రాల వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికేందుకు మెలానియా నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికి..అధ్య‌క్ష ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు విడాకులు ఇస్తే ట్రంపును అవ‌మానించిన‌ట్టు అవుతుంద‌ని భావించి, విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ స‌ర్దుకుపోయింది.వైట్ హౌస్‌లోవీరిద్ద‌రూ వేర్వేరు బెడ్ రూమ్‌లో ఉండేవార‌ని ట్రంప్ అనుచ‌రుడు స్టీఫెన్ ఓల్కాఫ్ వెల్ల‌డించారు. ట్రంప్ ఓడిపోవ‌డం మెలానియాకు క‌లిసొచ్చిన‌ట్టైంది. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జో బైడెన్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. కానీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఇంకా ఓట‌మిని అంగీక‌రించ‌డం లేదు. అయితే ట్రంప్ ఓట‌మిని అంగీక‌రించాలంటూ ప‌లువురు పార్టీ ప్ర‌ముఖులు ఆయ‌న్ను కోరిన‌ట్లు తెలుస్తోంది.నిజానికి అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ప‌బ్లిక్‌గా ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ ఆమె త‌న అభిప్రాయాల‌ను వైట్ హౌజ్ ప్ర‌తినిధుల‌తో వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. రెండ‌వ సారి అధ్య‌క్షుడిగా పోటీ చేసిన ట్రంప్ త‌ర‌పున మెలానియా ప్ర‌చారం నిర్వ‌హించారు. డోనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్‌కుష్న‌ర్ కూడా ఓట‌మి గురించి ఆయ‌న‌తో సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రో వైపు త‌ప్పుడు ప‌ద్ధ‌తుల్లో బైడెన్ విజేత‌గా
ప్ర‌క‌టించుకుంటున్నార‌ని అధ్య‌క్షుడు ట్రంప్ ఆరోపించారు. ఫ‌లితాల‌పై కోర్టులోనే తేల్చుకుంటార‌న్నారు.
అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో బైడెన్ 290, ట్రంప్ 214 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను గెలుచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *