గ్లోబ‌ల్ ర్యాంకింగ్స్‌లో హెచ్‌సీయూ….

హైద‌రాబాద్ః గ‌చ్చిబౌలిలోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ గ్లోబ‌ల్ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించింది. ఆర్‌యూఆర్ ర్యాంకింగ్ ఏజెన్సీ, క్లెరివేట్ అన‌లైటిక్స్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఆర్‌యూఆర్‌2020 లైప్ సైన్సెస్ వ‌ర‌ల్డ్ యూనివ‌ర్సిటీ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 800ల‌కు పైగా యూనివ‌ర్సిటీల్లో టీచింగ్‌, రీసెర్చ్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ డైవ‌ర్స‌టీ, ఫైనాన్షియ‌ల్ స‌స్టేన‌బిలిటీ అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని స‌ర్వేని నిర్వ‌హించారు. కాగా భార‌త‌దేశంలోని 13 యూనివ‌ర్స‌టీల్లో హెచ్‌సీయూ 7వ స్థానంలో ఉండ‌గా, ప్ర‌పంచ వ్యాప్తంగా 829యూనివ‌ర్సిటీల్లో 365 అంతర్జాతీయ యూనివ‌ర్సిటీల్లో ఒక‌టిగా హెచ్‌సీయూ నిలుస్తుంద‌న్నారు. టాప్‌75 టీచింగ్ యూనివ‌ర్సిటీల్లో ఒక‌టిగా నిలిచింద‌న్నారు. వ‌ర్సిటీలోని నైపుణ్య‌లైన అధ్యాప‌కులు మెరుగైన ప‌రిశోధ‌కుల‌ను త‌యారు చేస్తున్న‌ట్లు తెలిపారు. దీంతో పాటుగా యువ అధ్యాప‌కుల‌ను నిపుణులుగా త‌యారు చేసేందుకు దోహాద‌ప‌డుతుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *