ఐక్య‌రాజ్య‌స‌మితి స‌ల‌హా క‌మిటీకి భార‌త డిప్లోమాట్ ఎన్నిక‌…

న్యూఢిల్లీః ఐక్య‌రాజ్య‌స‌మితి స‌ల‌హా క‌మిటీకి భార‌త దౌత్య‌వేత్త విదిషా మైత్రా ఎన్నిక‌య్యారు. ఐరాస జ‌న‌ర‌ల్ అసెంబ్లీ అనుబంధ సంస్థ అయిన అడ్మినిస్ట్రేటివ్ అండ్ బ‌డ్జెట్ ప్ర‌శ్న‌ల‌పై ఐరాస స‌ల‌హా క‌మిటీ (ACABQ)లో ఆమెకు స్థానం ద‌క్కింది. ఆసియా- పిసిఫిక్ దేశాల బృందంలో ఐరాస భార‌త శాశ్వ‌త మిష‌న్‌కు మొద‌టి కార్య‌ద‌ర్శి అయిన మైత్రా126ఓట్లు సాధించారు. 193 మంది స‌భ్యులున్న జ‌న‌ర‌ల్ అసెంబ్లీ ఈ స‌ల‌హా క‌మిటీ స‌భ్యుల‌ను నియ‌మిస్తుంది. విస్తృత భౌగోళిక ప్రాతినిధ్యం, వ్య‌క్తిగ‌త అర్హ‌త‌లు, అనుభవం ఆధారంగా స‌భ్యుల‌ను ఎంపిక చేస్తారు. ఆసియా -పిసిఫిక్ దేశాల బృందం నుండి నామినేట్ అయిన ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌లో ఎంఎస్ మైత్రా ఒక‌రు. ఈబృందంలో ఇరాక్‌కు చెందిన అలీ మ‌హ్మ‌ద్ ఫాయ‌క్ అల్‌-ద‌బాగ్‌64ఓట్లు సాధించారు. ప‌రిపాల‌నా, బ‌డ్జ్‌ట్ అంశాల‌పై వ్య‌వ‌హ‌రించే స‌ర్వ‌స‌భ్యఐద‌వ‌ క‌మిటీ ఎంఎస్ మైత్రాను అంసెబ్లీకి సిఫారసు 2021 జ‌న‌వ‌రి నుంచి రెండేళ్ల కాలానికి ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో తాత్కాలిక స‌భ్య దేశంగా భార‌త్ ఉండ‌నున్న త‌రుణంలో ఐరాస స‌ల‌హా క‌మిటీకి విదిషా మైత్రా ఎన్నిక కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *