కరోనా టీకా తీసుకోండి -ఆప‌కండి

జెనీవా: క‌రోనా టీకాకు ను వాడుతూనే ఉండాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యాస్వామినాథ‌న్ తెలిపారుఆక్స్‌ఫ‌ర్డ్‌, ఆస్ట్రాజెన్‌కా త‌యారు చేస్తున్న క‌రోనా టీకాకు చాలా వ‌ర‌కు యూరోప్ దేశాలు నిషేధించాయి. ఆ టీఆకాను వేసుకోవ‌డం లేద‌ని ఇప్ప‌టికే కొన్ని దేశాలు స్ప‌ష్టం చేశాయి. ఆస్ట్రాజెన్‌కా టీకా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం గ‌డ్డ‌క‌డుతున్న‌ట్లు ఆరోప‌ర‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు ఆస్ట్రాజెన్‌కా టీకాను వాడుతూనే ఉండాల‌ని సౌమ్యాస్వామినాథ‌న్ ఓ సూచ‌న చేశారు. ఆస్ట్రాజెన్‌కా టీకా వినియోగంపై పూర్తి స్థాయిలో స‌మీక్ష చేస్తున్నామ‌ని, ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆందోళ‌న‌కు గురికావొద్దు అని ఆమె తెలిపారు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో… అన్ని దేశాలు ఆస్ట్రాజెన్‌కా టీకాను తీసుకోవ‌డం ఆప‌వ‌ద్దు అంటూ ఆమె త‌న సూచ‌న‌ల్లో తెలిపారు. ఆస్ట్రాజెన్కా టీకాను తీసుకుంటూనే ఉండాలంటూ సౌమ్యా స్వామినాథ‌న్ త‌న ట్వీట్లో తెలిపారు. ఏ వ్యాక్సిన్ అయినా లేక మందు అయినా.. వంద‌శాతం సుర‌క్షితంగా ఉండ‌వ‌న్నారు. ల‌క్ష‌ల్లో ఎవ‌రో ఒక‌రికి ఏదో ఒక‌టి జ‌రుగుతుంద‌ని, కానీ ల‌క్ష‌ల మందిని చంపేస్తున్న వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు టీకా అవ‌స‌ర‌మ‌న్నారు. మ‌రోవైపు ఈరోజు డ‌బ్ల్యూహెచ్‌వోకు చెందిన ప్ర‌త్యేక బృందం ఆస్ట్రాజెన్‌కా వినియోగంపై స‌మీక్ష చేయ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *