ద‌య‌చేసి ప్ర‌జా తీర్పును గౌర‌వించండి- మ‌మ‌తా బెన‌ర్జీ

కోల్ క‌తా: రాష్ట్రంలో జ‌రుగుతున్న అమ‌నూష‌మైన సంఘ‌ట‌న‌పై నేడు కోల్ క‌తా లో మమ‌తా బెన‌ర్జీ మాట్లాడుతూ ప్ర‌జాతీర్పును భార‌తీయ జ‌నతాపార్టీ నేత‌లు అంగీక‌రించ‌డం లేద‌ని, అందుకే ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌పై పాల్ప‌డుతున్నారని విమ‌ర్శించారు. బీజేపీ నేతలు రాష్ట్ర‌వ్యాప్తంగా తిరుగుతూ అసాధార‌ణ ప‌రిస్థితులకు ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతున్నారు. పశ్చిమ బెంగాల్ లోత‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఇంకా 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌లేదని, ఇలా దారుణాన్నికి దిగ‌జారిపోవ‌డం అమానుషం.కానీ బీజేపీ నేత‌లు లేఖ‌లు పంపుతున్నారు. గ్రూపుల‌ను పంపుతున్నారు. పెద్ద ఎత్తున నేతలు వ‌స్తున్నారు. నిజానికి వారు ప్ర‌జా తీర్పును గౌర‌వించ‌డం లేదు. నేను వారికి విజ్ఞ‌ప్తి చేసేది ఒక్క‌టే. ద‌య‌చేసి ప్ర‌జా తీర్పును గౌర‌వించండి అని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *