ఆల్‌రౌండ్ ప‌ర్ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టాడు

ముంబై: టీమిండియా బ్రిస్బేన్ టెస్ట్‌లో చారిత్ర‌క విజ‌యం సాధించ‌డంలో త‌న వంతు పాత్ర పోషించాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్‌. ఆల్‌రౌండ్ ప‌ర్ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీల‌క‌మైన 62 ప‌రుగులు చేయ‌డంతోపాటు 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక చేజింగ్‌లోనూ 22 ప‌రుగుల చేశాడు. త‌న కొడుకు ప్ర‌ద‌ర్శ‌న చూసి చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నారు. అత‌ని తండ్రి ఎం. సుంద‌ర్ ఆస్ట్రేలియాలో అత‌ని ప్ర‌ద‌ర్శ‌న చాలా ప్ర‌త్యేక‌మైద‌ని , అత‌డు ఓ లెజెండ్ అవుతాడ‌ని ఆయ‌న అంటున్నారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సుంద‌ర్ మాట్లాడారు. వాషింగ్ట‌ట్‌, అశ్విన్ , న‌ట‌రాజ‌న్‌, టీమిండియాను చూసి చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. వాషింగ్ట‌న్ స‌హ‌జంగానే ఓపెనింగ్ బ్యాట్స్‌మ‌న్. అత‌ను త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని ఉప‌యోగించుకున్నాడు. అని సుంద‌ర్ అన్నారు. వాషింగ్ట‌న్‌లో నైపుణ్యం , క‌ఠినంగా శ్ర‌మించే త‌త్వం , అంకిత భావం , క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్నాయ‌ని, ఇండియ‌న్ టీమ్‌లో దేవుడు అత‌నికి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఇస్తాడ‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. నిజానికి చివ‌రి టెస్ట్‌లో ఈ బౌలింగ్ ఆల్‌రౌండ్‌కు అనుకోకుండా చోటు ద‌క్కింది. రెగ్యుల‌ర్ స్పిన్న‌ర్లు అశ్విన్‌, జ‌డేజా ఇద్ద‌రూ లేక‌పోవ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో సుంద‌ర్‌ను తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *