కేంద్ర‌ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న -విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై

అమ‌రావతి:మోదిప్ర‌భుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్ పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్రైవేటీక‌ర‌ణ త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఎంపీ స‌త్యనారాయ‌ణ అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర‌మంత్రి నిర్మల సీతారామ‌న్ కుండ‌బద్ద‌లు కొట్టారు. స్టీల్ ప్లాంట్ వ్య‌వ‌హారంలో రాష్ట్రానికి సంబంధ‌లేద‌ని ఆమె తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవ‌న్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మ‌కంపై జ‌గ‌న్ స‌ర్కార్ ఇప్ప‌టికే సంప్ర‌దింపులు జ‌రిపామ‌ని ఆమె పేర్కొన్నారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఏపీ ప్ర‌భుత్వాన్ని కోరామ‌న్నారు. స్టీల్ ప్లాంట్‌ వంద శాతం పెట్టుబడుల‌ను ఉప‌హ‌రించుకుంటున‌ట్లు నిర్మాల సీతారామ‌న్ తెలిపారు. ఇక స్టీల్ ప్లాంట్ లో ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ ఇప్ప‌టికే ఏపీలో ఆందోళ‌న‌లు ఉధృత‌మ‌య్యాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు ఉప‌సంహరించుకోవాల‌ని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. విశాఖ‌లో చేస్తున్న ఆందోళ‌న‌కు మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించాయి. ఏపీ, తెలంగాణ మావోయిస్టులు కూడా ఇప్ప‌టికే సంఘీభావం ప్ర‌క‌టించారు. స్టీల్ ప్లాంట్‌పై స‌రికొత్త వార్త కేంద్ర‌ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న రాజ‌కీయ చ‌ర్చ‌కు దారితీస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *