గారాల‌ప‌ట్టితో క‌లిసి దిగిన తొలి ఫొటో..

న్యూఢిల్లీ: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ దంప‌తులు త‌మ కుమారైకు వామిక అని పేరు పెట్టారు. గారాల‌ప‌ట్టితో క‌లిసి దిగిన తొలి ఫొటోను అనుష్క సోమ‌వారం సామాజిక మాధ్య‌మాల్లో పంచుకుంది. మేమెప్పుడూ ప్రేమ‌, ఆప్యాయాల‌తో క‌లిసి జీవించాం. వామిక వాటిని మ‌రోస్థాయికి తీసుకెళ్లింది. చిరున‌వ్వులు, క‌న్నీళ్లు వంటి భావోద్యేగాల‌ను నిమిషాల వ్య‌వ‌ధిలో అనుభ‌వించేలా చేసింది. ప్ర‌స్తుతం మా మ‌న‌సులు పూర్తి ప్రేమ‌తో నిండిపోయాయి. అని రాసుకొచ్చింది.ఈ సంద‌ర్భంగా త‌మ‌కు శుభాకాంక్ష‌లు తెలిసిన వారంద‌రికీ అనుష్క ధ‌న్య‌వాదాలు చెప్పింది. దీనిపై స్పందించిన కోహ్లీ నా ప్ర‌పంచ‌మంతా ఒకే ఫ్రేమ్ లో ఉంది. అని బ‌దులిచ్చాడు. జ‌న‌వ‌రి 11న అనుష్క పాప‌కు జ‌న్మనిచ్చింది.
అర్థం తెలుస్తా..!
సామాజిక మ‌ధ్య‌మాల ద్వారా విరుష్క జంట‌గా గుర్తింపు పొందిన విరాట్‌, అనుష్క‌… త‌మ కూతురి పేరులోనూ అదే సంప్రదాయాన్ని కొన‌సాగించింది. విరాట్ కోహ్లీ పేరులోని తొలి అక్ష‌ర‌మైన వి తో ప్రారంభించి అనుష్క పేరులోని చివ‌రి శ‌బ్ధ‌మైన క‌తో ముగించింది. ఇక హిందూ ధ‌ర్మ‌శాస్త్రం ప్రకారం
వామిక అంటే దుర్గామాత కాగా… లింగ స‌మాన‌త్వానికి ప్ర‌తీక‌లా విరుష్క‌జోడీ ఈ పేరును ఎంపిక చేస్తుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *