కోహ్లీసేన‌కు స‌మ‌స్యేమీ కాదు- సునీల్‌గ‌వ‌స్క‌ర్‌

ముంబ‌యి:క‌్రికెట్ దిగ్గ‌జం సునీల్ గావ‌స్క‌ర్ ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ జ‌ట్టు సుప‌ర్‌గా ఆడుతుంద‌న్నారు. కోహ్లీ సార‌థ్యంలో జ‌ట్టు విజ‌యం సాధిస్తుంద‌న్నారు. ఆంగ్లేయులు పిచ్‌ల‌పై ప‌చ్చిక‌ను ఉంచినా ఆశ్చ‌ర్యం లేద‌ని పేర్కొన్నారు.టీమ్ ఇండియా బుధ‌వారం ఇంగ్లాండ్ కు చేరుకుంది. సౌథాంప్ట‌న్‌లో ఆట‌గాళ్లంతా క్వారంటైన్ అయ్యారు. మూడు రోజుల క‌ఠిన క్వారంటైన్ త‌రువాత వీరంతా క‌లిసే సాధ‌న చేస్తారు. జూన్ 18న న్యూజిలాండ్‌తో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌ల్లో త‌ల‌ప‌డ‌తారు. ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్లో ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడ‌తారు. ఈ సిరీసును రెండు టీమ్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఎండాకాలం కావ‌డంతో పిచ్‌లు ట‌ర్న్ అవుతాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. దాంతో కోహ్లీసేన సిరీసును స్వీస్ చేసినా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు న్యూజిలాండ్‌తో ఫైన‌ల్ ముగిసిన ఆరువారాల త‌రువాత ఇంగ్లాండ్ సిరీస్ ఆరంభ‌మ‌వుతుంది. కాబ‌ట్టి ఫైన‌ల్ ఫ‌లితం ప్ర‌భావం భార‌త్ మ‌రియు ఇంగ్లాండ్ సిరీస్‌పై త‌క్కువ‌గా ఉంటుంది. ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్లో ఆడుతున్నారు. కాబ‌ట్టి భార‌త్4-0 తో సిరీస్ కైవ‌సం చేసుకుంటుంద‌ని ఇండియాలో ప‌ర్య‌టించిన‌ప్పుడు స్పిన్ పిచ్‌ల‌పై ఆంగ్లేయులు పెద‌వి విరిచారు. కానీ ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ లో పిచ్ పై ప‌చ్చిక‌ను ఉంచినా ఆశ్చ‌ర్యం లేదు. అది కోహ్లీసేన‌కు స‌మ‌స్యేమీ కాదు. అలాంటి పిచ్‌ల‌పై రాణించ‌గ‌ల పేస‌ర్లు మ‌న‌కు ఉన్నారు. దాంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ క‌చ్చితంగా ఇబ్బంది ప‌డ‌తారు. అని గావ‌స్క‌ర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *