ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ‌కు జోడిగా కేఎల్ రాహుల్‌- విరాట్

అహ్మ‌దాబాద్‌: టీమ్ ఇండియా సార‌థి విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసులో రోహిత్ శ‌ర్మ కు జోడీగా కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడ‌ని తెలిపారు. మూడో ఓపెన‌ర్‌గా శిఖ‌ర్ ధావ‌న్ ఉంటాడ‌న్నాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ బాగా ఆడుతున్నంత వ‌ర‌కు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌కు ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ టీమ్‌లో చోటు క‌ష్ట‌మేన‌ని వెల్ల‌డించారు. తొలి టీ20కి ముందు విరాట్ మీడియాతో మాట్లాడాడు. రోహీత్ టీమ్‌లో ఉంటే కేఎల్ రాహుల్ అత‌డితో క‌లిసి ఓపెనింగ్ చేస్తాడు. ఇది చిన్న సంగ‌తి. నిల‌క‌డ‌గా ప‌రుగులు చేస్తున్నంత వ‌ర‌కు వీరిద్ద‌రే ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. రోహిత్ విశ్రాంతి తీసుకుంటే , రాహుల్‌కు గాయ‌మైతే శిఖ‌ర్ మూడో ఓపెన‌ర్ గా వ‌స్తాడు. సాధార‌ణ ప‌రిస్థితుల్లో మాత్రం రోహిత్‌, రాహులే ఓపెన‌ర్లు, అని విరాట్ అన్నారు.గ‌త సంవ‌త్స‌రం ఐపీఎల్ లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ బాగా ఆడాడు. ఇప్పుడు అత్యుత్త‌మ ఫామ్‌లో ఉన్నాడు.
అత‌డికి తెలుపు బంతి క్రికెట్లో చోటు ద‌క్కుతుందా అని ప్ర‌శ్నించ‌గా వాషింగ్ట‌న్ సుంద‌ర్ బాగా ఆడుతున్నాడు. అశ్విన్‌, సుంద‌ర్ ఆఫ్ స్పిన్ వేస్తారు. అందుకే చోటు మాత్రం ఒక్క‌రికే ఉంటుంది. సుంద‌ర్ పేల‌వ ఫామ్‌లో ఉండి, వికెట్లు తీయ‌లేక‌పోతుంటే మ‌రొక‌రికి అవ‌కాశం దొరుతుంది అని కోహ్లీ బ‌దులిచ్చాడు. అడిగే ప్ర‌శ్న‌ల‌కు కాస్త త‌ర్క‌మూ ఉండాలి. అశ్విన్ ను ఎక్క‌డ తీసుకోవాలి? ఎక్క‌డ ఆడించాలో మీరే సూచించండి. సుంద‌ర్ ఇప్ప‌టికే బాగా ఆడుతున్నాడు. ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం తేలీకే.కానీ త‌ర్క‌మూ అవ‌స‌ర‌మే క‌దా అని విరాట్ తెలిపాడు. ఫిట్ నెస్ ప్రమాణాలు అందుకోనంత వ‌ర‌కు ఆట‌గాళ్ల‌కు టీమ్‌లో చోటు దొర‌క‌ద‌ని కోహ్లీ స్ప‌ష్టం చేశాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి గురించి అడ‌గ్గా ఇలా జ‌వాబిచ్చాడు. ఎన్‌సీఏలో నిర్వ‌హించిన యోయో(17),2 కి,మీ ప‌రుగు (8 నిమిషాల్లో) పోటీల్లో వ‌రుణ్ విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. భార‌త్ జ‌ట్టు కోసం సృష్టించుకున్న వ్య‌వ‌స్థ‌ను అంద‌రూ అర్థం చేసుకోవాలి. ఫిట్ నెస్ ప‌రంగా అత్యున్న‌త స్థాయిలో ఉండ‌టం అవ‌స‌రం. అలా పాటిస్తోంది కాబ‌ట్టే భార‌త్ జ‌ట్టు అన్ని ఫార్మాట్ల‌లో ప్ర‌స్తుతం ప‌టిష్టంగా ఉంది. టీమ్‌లో చోటు కావాలంటే ప్ర‌మాణాల‌ను అందుకోనేందుక‌కు ప్ర‌య‌త్నించాలి ఇందులో రాజీలేదు. అని విరాట్ స్ప‌ష్టం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *