నాకు ఆనందాన్నిచ్చింది అదే…

అహ్మ‌దాబాద్‌:భార‌త్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెన్నైలో జ‌రిగిన రెండో టెస్టులో పుంజుకోవ‌డ‌మే త‌న‌కు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింద‌ని అన్నారు. నూత‌న మ్యాచులో ఇంగ్లాండ్ త‌మ‌ను చిత్తుగా ఓడించిందని గుర్తు చేసుకున్నాడు. యువ‌కులు త‌మ‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంటున్నార‌ని పేర్కొన్నాడు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ త‌మ టీమ్ కు అత్యంత విలువైన ఆట‌గాడ‌ని స్ప‌ష్టం చేశాడు.3-1తేడాతో ఇంగ్లాండ్ పై సిరీస్ కైవ‌సం చేసుకున్న త‌రువాత అత‌డు మీడియాతో మాట్లాడాడు. తొలి టెస్టులో టాస్ కీల‌కంగా మారింది. బౌల‌ర్ల‌కు అస్స‌లు క‌లిసిరాలేదు. అందుకే రెండో టెస్టులో పుంజుకోవ‌డం సంతోషంగా అనిపించింది. ఈ రిజ‌ర్వు బెంచ్ అత్యంత ప‌టిష్టంగా ఉంది. భార‌త క్రికెట్ శుభ‌‌సూచ‌కం. ప్ర‌మాణాలు ఏమాత్రం త‌గ్గ‌లేదు. మ్యాచులో కీల‌క‌మైన స‌మ‌యంలో రిష‌బ్‌, సుంద‌ర్‌త‌మ భాగ‌స్వామ్యంతో దీనిని రుజువుచేశారు. తొలిటెస్టు త‌రువాత మా దేశ భాష‌ను మ‌రింత మెరుగుప‌ర్చుకున్నాం. అని కోహ్లీ వివ‌రించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్లో ప్ర‌తి జ‌ట్టు నాణ్య‌మైందే.సొంత‌గ‌డ్డ‌పై అయినా స‌రే వారిని ఓడించేందుకు శ్ర‌మించాల్సిందే. ఈ తీవ్ర‌త‌ను కొన‌సాగించ‌డ‌మే చాలా ముఖ్యం. మా జ‌ట్టు లక్ష్య‌మూ అదే. చెన్నైలో రోహీత్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు కొన్నేళ్లుగా అశ్విన్ మాకు ముఖ్య ఆట‌గాడిగా ఉన్నాడు. వీరిద్ద‌రూ ఈ టెస్టు సిరీసులో రాణించారు. ప్ర‌స్తుతం మేం ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ స‌వాల్ ను స్వీక‌రిస్తున్నాం. 2020 లో మేం కివీస్ చేతిలో దారుణంగా ఓడాం కానీ ప్ర‌స్తుతం మే మెరుగ్గా ఉన్నాం అని కోహ్లీ తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *