పాండ్యా వెల్‌క‌మ్ ఇండియ‌న్ కెప్టెన్..

హైద‌రాబాద్‌: అక్ష‌ర్ ప‌టేల్ ఈ టెస్ట్‌లో మొత్తం 11 వికెట్లు తీశాడు. ఇండియా విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు. నాలుగు టెస్ట్ ల సిరీస్‌లో భార‌త్ 2-1తో టెస్టు చాంపియ‌న్‌షిప్ రేసులో నిలిచింది. అయితే మ్యాచ్ అనంత‌రం టీమిండియా ఆల్ రౌండ‌ర్‌… మ‌రో లోక‌ల్ ఆట‌గాడు హార్ధిక్ పాండ్యా అక్ష‌ర్ అభినందిస్తూ స‌ర‌దాగా ఇంట‌ర్వ్యూ చేశాడు. మొటేరా వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా అద్భుత విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే.వీరి మ‌ధ్య సంభాష‌ణ సీరియ‌స్‌గా కొన‌సాగుతున్న స‌మ‌యంలో విరాట్ కోహ్లీ అక్క‌డికి వ‌చ్చి…. అత‌న్ని చూసిన పాండ్యా వెల్‌క‌మ్ ఇండియ‌న్ కెప్టెన్ అంటూ ఆ ఇంటార్వ్యాలోకి ఆహ్వానించాడు. తిరిగి మ‌రో ప్ర‌శ్న అడుగుతున్న స‌మ‌యంలో అత‌ని చేతిలో ఉన్న మైకును లాక్కొన్న కోహ్లీ .గుజ‌రాతీలో అక్ష‌ర్‌పై సెటైర్ వేయ‌గా ముగ్గురు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *