వికాట్ కోహ్లీ విజ్ఞ‌ప్తి మేర‌కు బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం ..

హైద‌రాబాద్‌: ఐపీఎల్ 14వ సీజ‌న్ మ‌రో రెండు వారాల్లో ప్రారంభ‌మ‌వుతాయ‌ని ఫీల్డ్ అంఫైర్ సాప్ట్ సిగ్న‌ల్ విధానాన్ని బీసీసీఐ తొల‌గించింది. ఏదైనా ఔట్ విష‌యంలో స్ప‌ష్ట‌త కోసం ఫీల్డ్ అంఫైర్ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మూడోవ అంఫైర్ అత్యుత్త‌మ నిర్ణ‌యం తీసుకునేందుకు వీలుగా ఈసాప్ట్ సిగ్న‌ల్‌ను తొల‌గించారు. ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20 నేప‌థ్యంగా సూర్య‌కుమార్ క్యాచ్‌ను డేవిడ్ మ‌ల‌న్ స‌రిగా అందుకున్నాడా లేదా అన్న‌దానిపై స్ప‌ష్ట‌త లేక‌పోయినా..మైదానం అంఫైర్ ఔట‌ని సాఫ్ట్ సిగ్న‌ల్ ఇచ్చాడు. దాంతో మూడో అంఫైర్ కూడా సూర్య‌ను ఔట్‌గా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా భార‌త్ జ‌ట్టు సార‌థి విరాట్ కోహ్లీ ఈ సాప్ట్ సిగ్న‌ల్ ప‌ద్ధ‌తిని వ్య‌తిరేకించారు. మ్యాచ్ అనంత‌రం కోహ్లీ మాట్టాడుతూ ఈ ప‌ద్ధ‌తిని తొల‌గించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. దాంతో తొల‌గించాల‌ని నిర్ణ‌యించింది. కాగా, చాలా రోజులుగా ఈ సాప్ట్ సిగ్న‌ల్ విధానంపై తీవ్ర చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. క్రికెట్ దిగ్జ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ సైతం దాన్ని తొల‌గించాల‌ని బ‌హిరంగంగానే చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *