విరాట్‌తో క‌లిసి క‌రోనా పై పోరాటం చేస్తున్నా-అనుష్క‌శ‌ర్మ‌

హైద‌రాబాద్‌: ఇప్పుడు కొవిడ్ క‌ర‌ళ‌నృత్యం చేస్తున్న విష‌యం తెలిసిందే.దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ విలాయ‌తాడ‌వం చేస్తోంది. చాలా మంది ప్ర‌జ‌ల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. ఇలాంటి త‌రుణంలో వారికి అండ‌గా నిల‌బ‌డేందుకు సెల‌బ్రిటీలు ముందుకు వ‌స్తున్నారు. విరాట్, అనుష్క శ‌ర్మ దంప‌తులు ఇప్ప‌టికే కొవిడ్ బాధితుల స‌హాయార్థం రూ.2 కోట్లు విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌గా, ప్ర‌స్తుతం ఫండ్ రైజింజ్ కోసం క్యాంపెయిన్ మొద‌లు పెట్టారు. దేశం మొత్తం క‌రోనా మ‌హ‌మ్మారి పై పోరాటం చేస్తుంది. ఇలాంటి నేప‌థ్యంలో మా వంతుగా విరాళాలు సేక‌రించాల‌ని అనుకుంటున్నాం అని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు భార‌త‌దేశంలో ప‌రిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. కొవిడ్‌పై ఇండియా మొత్తం పోరాటం చేస్తుండ‌గా, ఈ ప‌రిస్థితుల‌లో ప్ర‌జ‌ల పోరాటం చాలా క‌ష్టంగా ఉంది. మ‌న కోసం వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. వారికి ప్ర‌స్తుతం మ‌నం అండ‌గా ఉండాలి.అందుకే అనుష్క శ‌ర్మ‌, నేను…. కెట్టోతోక‌లిసి ఫండ్ క్యాంపెయిన్ ను మొద‌లు పెడుతున్నాం. మీరిచ్చే ప్ర‌తి రూపాయి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న కుటుంబం కోసం, స్నేహితుల కోసం క‌లిసి క‌ట్టుగా ప‌ని చేద్దాం.కొవిడ్‌ను జ‌యిద్దాం. స్టే సేఫ్, హోమ్ అంటూ వీడియో సందేశంలో తెలిపారు. విరాట్ దంప‌తులు.కాగా, కొద్ది రోజుల వ‌ర‌కు ఐపీఎల్2021 తో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ, ఈ సిరీస్ అర్థాంత‌రంగా ఆగిపోవ‌డంతో
ఇంటికి చేరుకొని క‌రోనా బాధితుల కోసం స‌హాయ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *