విరాట్ కోహ్లీ రెండు రికార్డుల‌కు చెరువ‌లో….

చెన్నై:ఇంగ్లండ్‌తో ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు రికార్డుల‌కు చేరువ‌లో ఉన్నాడు. ఇప్ప‌టి వ‌రకూ టీమిండియా మోస్ట్ స‌క్సెస్‌పుల్ కెప్టెన్ ఎవ‌రంటే ఎమ్మెస్ ధోనీయే గుర్తుకు వ‌చ్చేవాడు. కానీ ప్ర‌స్తుతం రికార్డును ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనే కోహ్లీ చెరివేసే అవ‌కాశాలు ఉన్నాయిన సొంత‌గ‌డ్డ‌పై కెప్టెన్‌గా ధోనీ21 టెస్టుల్లో టీమ్‌ను గెలిపించాడు. ఇప్పుడు కోహ్లీ ఖాతాలో 20 విజ‌యాలు ఉన్నాయి. మ‌రో మ్యాచ్ గెలిస్తే ధోనీని అత‌డు స‌మం చేస్తాడు. ఇక కెప్టెన్‌గా టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన వాళ్ల లిస్ట్‌లో నాలుగో స్థానానికి ఎగ‌బాక‌డానికి కోహ్లీ 14 ప‌రుగులు దూరంలో ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ కోహ్లీ టెస్టుల్లో కెప్టెన్‌గా 5220 ప‌రుగులు చేశాడు. మ‌రో 14 ప‌రుగులు చేస్తే… విండీస్ దిగ్గ‌జం క్లైవ్‌లాయిడ్ రికార్డును కోహ్లీ అధిగ‌మిస్తాడు. కోహ్లీ, లాయిడ్ కంటే ముందు గ్రేమ్ స్మిత్‌(8659), అల‌వ్ బోర్డ‌ర్ (6623),రికీ పాంటింగ్ (6542) ఉన్నారు. ఇంగ్లండ్ ,ఇండియా మ‌ధ్య తొలి టెస్ట్ ఫిబ్ర‌వ‌రి5 నుంచి చెన్నైలో జ‌ర‌గ‌నున్న విస‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *