విరాట్ కోహ్లీ క‌న్నా ఎక్కువ పారితోష‌కం బుమ్రాకే

హైద‌రాబాద్ః మ‌నం చూస్తుండానే 2020 ముగిసింది. క‌రోనా నేప‌థ్యంలో టీమ్ఇండియా ఈ సంవ‌త్స‌రం ప‌రిమిత సంఖ్య‌ల‌నే మ్యాచ్‌లాడింది. అయితే, భార‌త ఆట‌గాళ్లలో ఈ ఏడాది అంద‌రి క‌న్నా ఎక్కువ ఆర్జించింది. మాత్రం పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా,కెప్టెన్ విరాట్ కోహ్లీ క‌న్నా ఎక్కువ పారితోష‌కం సంపాదించాడు.బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లో కోహ్లీ, బుమ్రా, రోహిత్ శ‌ర్మ ఎ+ కేట‌గిరీలో ఉన్నారు. ఈ ముగ్గురూ సంవ‌త్సరానికి రూ.7కోట్ల చొప్పున అందుకుంటారు. ఇది కాకుండా బీసీసీఐ ఆట‌గాళ్ల‌కు మ్యాచ్‌ఫీజులు కూడా చెల్లిస్తుంది. ఒక్కటెస్టు మ్యాచ్‌కు రూ.15 ల‌క్ష‌లు, వ‌న్డేకు రూ.6ల‌క్ష‌లు ,టీ 20ల‌కు3ల‌క్ష‌ల చొప్పున పారితోష‌కం అంద‌జేస్తుంది.ఈ నేప‌థ్యంలో బుమ్రా 2020లో అంద‌రిక‌న్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఎక్కువ ఆదాయం పొందాడు. మొత్తం4 టెస్టులు,9వ‌న్డేలు, 8టీ20లు ఆడిన టీమ్ఇండియా పేస‌ర్ ఈ సంవత్స‌రం మ్యాచ్ ఫీజుల రూపంలో రూ.1.38కోట్లుత‌న ఖాతాలో వేసుకోనున్నాడు. కోహ్లీ ఇప్పుడు ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్టు ఆడ‌లేక‌పోవ‌డంతో రూ.1.29 కోట్లు అందుకోనున్నాడు. ఒక‌వేళ ఈ మ్యాచ్ కూడా ఆడి ఉంటే టీమ్ ఇండియా సార‌థి మొత్తం రూ.144 కోట్లు అందుకొని అగ్ర‌స్థానంలో నిలిచేవాడు. మ‌రోవైపు ఎ కేట‌గిరీలో ఉన్న ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర‌జ‌డేజా ఈసంవ‌త్స‌రం మ్యాచ్ ఫీజుల రూపంలో తీసుకునేది రూ.96 ల‌క్ష‌లు. బుమ్రా, కోహ్లీ త‌రువాత ఇత‌డే మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ ఈ ఏడాది గాయాల కార‌ణంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడ‌లేక‌పో యాడు. దీంతో అత‌డి ఆదాయం రూ.30ల‌క్ష‌ల‌కే ప‌రిమిత‌మైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *