స‌గంలో వాళ్ల‌పై మేము ఒత్త‌డి తీసుకురాలేక‌పోయాం…

చెన్నై : భార‌త్‌జ‌ట్టు ఇంగ్లండ్ తో జ‌రిగిన తొలి టెస్ట్‌లో దారుణ ప‌రాజ‌యంపై మాట్లాడాడు కెప్టెన్ విరాక్ కోహ్లీ. జ‌ట్టులోని ప్లేయ‌ర్స్ బాడీ లాంగ్వేజ్ బాగా లేద‌ని, ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని కోహ్లీ అన్నాడు. అనుభవం లేని స్పిన్న‌ర్ల‌యిన వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, షాబాజ్ న‌దీమ్ అంత స‌మ‌ర్థంగా బౌలింగ్ చేయ‌లేకపోయార‌ని చెప్పాడు. తొలి సగంలో వాళ్ల‌పై మేము త‌గిన ఒత్త‌డి తీసుకురాలేక‌పోయాం. పేస్ బౌర్లు,అశ్విన్ బాగా బౌలింగ్ చేశారు. అయితే తొలి ఇన్నింగ్స్ లో కొన్ని ప‌రుగులను మేము క‌ట్ట‌డి చేయాల్సింది అని అన్నాడు. తొలి రెండు రోజులూ పిచ్ బౌలింగ్ కు అంత‌గా అనుకూలించ‌లేద‌ని విరాట్ చెప్పాడు. ఇంగ్లండ్‌కే క్రెడిట్ ద‌క్కుతుంద‌ని, వాళ్లు భారీ స్కోరుచేసి త‌మ‌పై ఒత్త‌డి పెంచార‌ని కోహ్లీ అన్నాడు. రెండో టెస్ట్ చెన్నైలోనే ఫిబ్ర‌వ‌రి 13నుంచి జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు సంవ‌త్స‌రం త‌రువాత తొలిసారి ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *