ఫేస్‌బుక్ వేదిక‌గా సీఎంపై ఆమె ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు…

హైద‌రాబాద్‌: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మ‌రోసారి విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. సోమ‌వారం రాత్రి ఫేస్‌బుక్ వేదిక‌గా సీఎంపై ఆమె ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. హిందువుల ఓట్లు గుర్తుకొచ్చిన‌ప్పుడ‌ల్లా య‌జ్ఞాలు, పూజ‌లు ,స్వాముల‌తో మంత‌నాల‌లో మునిగితేలే కేసీఆర్‌కు గోమాత మాత్రం దైవంగా క‌నిపించ‌దేం? అంటూ రాముల‌మ్మ ప్ర‌శ్నించారు.
ఎన్ని విజ్ఞ‌ప్తులు పెట్టుకున్నా!
గోపును జాతీయ ప్రాణిగా ప్ర‌క‌టించాల‌న్న ల‌క్ష్యంతో నిన్న ఆదివారం హైద‌రాబాద్‌లోని చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి మందిరం నుంచి బ‌హ‌దూర్‌పురా మ‌ల్ల‌న్న ఆల‌యం వ‌ర‌కు గో మ‌హాయాత్ర నిర్వ‌హించేందుకు ముందుకు వ‌చ్చిన ప‌లు గో సంర‌క్ష‌ణ సంస్థ‌ల‌కు అనుమ‌తి కూడా ఇవ్వ‌లేదు. ఇప్ప‌టికే దేశంలోనే గో హ‌త్య‌లు అత్య‌ధికంగా జ‌రుగుత‌న్న రాష్ట్రాల‌లో తెలంగాణ ముందుంది. తెలంగాణలో అక్ర‌మంగా వున్న‌ క‌బేళాల‌ను మూసివేయించాల‌ని ఎన్ని విజ్ఞ‌ప్తులు పెట్టుకున్నా తెలంగాణ స‌ర్కారు ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. స్వ‌యంగా హిందువు అయి ఉండి … హిందుగాళ్లు బొందుగాళ్లు అంటూ చిల్ల‌ర వ్యాఖ్య‌లు చేసే కేసీఆర్ నుంచి గోమాత ర‌క్ష‌ణ‌ను ఆశించ‌డం.. ఇసుక నుంచి తైలం పిండే ప్ర‌య‌త్నం ఒక‌టే అని విజ‌య‌శాంతి ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *