స‌మాజంలో స‌గంభాగం స్త్రీలు…

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పురష్కరించుకొని ముషిరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని క‌శిష్ ఫంక్ష‌న్ హాల్ లో అక్షర స్పూర్తి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈస‌మావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. స్త్రీలేనిదే స‌మాజం లేదా అన్నారు. మ‌హిళా ప్రాముఖ్య‌త‌ను ఎన్న‌టికీ మ‌రిచిపోవ‌ద్ద‌ని, వారు లేద‌ని ప్ర‌పంచం లేద‌ని బీజేపీ నేత విజ‌య‌శాంతి పెర్కోన్నారు. ఇంత‌ముందు కాలంలో ఇంటికే ప‌రిమిత‌మైన మ‌హిళ‌లు ఇప్పుడు స‌మాజంలో అన్ని రంగాల్లో ముందు నిలుస్తున్నార‌ని చెప్పారు. ఒక‌ప్పుడు మాట్లాడ‌డానికి వెన‌క‌డుగు వేసిన మ‌హిళ‌లు ఇప్పుడు స‌మాజంలో జ‌రుగుతున్న ప్ర‌తి అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తున్నార‌ని తెలిపారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌ను న్యాయం జ‌ర‌గ‌డం లేదని తెలంగాణ బీజేపీ అధికారంలోకి వ‌స్తే మ‌హిళ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు. సేవా రంగంలో ఉన్న మ‌హిళల‌ను వెలుగులోకి తీసుకురావ‌డానికి అక్ష‌ర స్ఫూర్తి ఫౌండేష‌న్ సంస్థ చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని విజ‌య‌శాంతి ప్ర‌శంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *