ప్ర‌భుత్వం, ప్ర‌యివేటు టీచ‌ర్ల‌యినా స‌మాజంలో గురువుస్థానం…..

హైద‌రాబాద్: బీజేపీ నేత విజ‌య‌శాంతి తెలంగాణ‌లో ప్ర‌యివేటు టీచ‌ర్ల దుస్థితిపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారి గోడు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ట్ట‌డం లేద‌ని, కంటితుడుపు చ‌ర్య‌లు త‌ప్ప వారి క‌ష్టాలు తొల‌గించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నంచ‌డం లేద‌ని మండిపడ్డారు. ఈమేర‌కు త‌న సోష‌ల్ మీడియా ఓ పోస్ట్ పెట్టారు. అందులో గ‌త ఆరు నెల‌లుగా ప్ర‌యివేటు టిచ‌ర్ల జీవితం అత్యంత దారుణంగా దిగిజారిపోయింది. క‌రోనా కార‌ణంగా ప‌రిస్థితుల వ‌ల్ల గ‌త ఏడాదినుంచి అక్టోబ‌ర్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 30మంది వ‌రుస ఆత్మహ‌త్య‌లు చేసుకున్నారు. పాల‌కులప‌ట్టింపులేనిత‌నంపై తీవ్ర మండిపడ్డారు.సంద‌ర్భంగా ఏదో తూతూ మంత్రంగా రాష్ట్ర ప్ర‌భుత్వం వారికి 2వేలు డ‌బ్బు ,25కిలోల బియ్యం సాయంగా ప్ర‌క‌టించింది. మ‌రెంద‌రో ఉద్యోగాలు కోల్పోయి నేటికి బండ్లు న‌డుపుకుంటూ ,కూర‌ల‌మ్ముకుంటూ , కూలీలుగా ఇలా బ‌తుకు గ‌డ‌వ‌డానికి ఎన్ని ర‌కాలుగా వీలైతే అన్ని ర‌కాల మార్గాలు వెదుక్కుంటున్నారు. ఈ ప‌రిస్థితుల‌పై మీడియాలో మొద‌టి నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు వ‌స్తునే ఉన్నాయి. అప్పుడే ప్ర‌భుత్వం మేల్కొని వారికి అండ‌గా పాల‌కులు ఉన్నార‌నే భ‌రోసా కాస్త‌యినా ఇచ్చి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవికాదు.ఈరోజు ఉన్న ప‌రిస్థితుల్లో మీరిచ్చే 2వేలు ఆ కుటుంబాల‌కు ఏమూల‌కు స‌రిపోతాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌యినా,ప్ర‌యివేటు టీచ‌ర్ల‌యినా సమాజంలో గురువుస్థానం ఎప్ప‌టికీ ఉన్న‌త‌మైన‌దేన‌ని ముందుగా ప్ర‌భుత్వం గుర్తించాలి. కేవ‌లం కాస్త డ‌బ్బు, బియ్యం ఇస్తే వారి క‌న్నీరు ఆగ‌దు. టీచ‌ర్లు గౌర‌వ‌ప్ర‌దంగా జీవించే ప‌రిస్థితులు క‌ల్పించిన‌ప్పుడే వారికి నిజ‌మైన సంతృప్తి. ప్ర‌భుత్వం ఈ దిశ‌గా ప్ర‌య‌త్నించాలి అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *