రాముడి విగ్ర‌హా ద్వంసం ఘ‌ట‌న‌తో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి…

హైద‌రాబాద్ః రామ‌తీర్థం విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని రామ‌తీర్థం కోదండ రామాల‌యంలోని రాముడి విగ్ర‌హా ధ్వంసం ఘ‌ట‌న‌తో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. బాధ్యులైన‌వారిని కఠినంగా శిక్షించాలంటూ టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు శ‌నివారం నిర‌స‌న తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఎపీ మంత్రులు ఆదివారం రామ‌తీర్థంలో ప‌ర్య‌టించ‌నున్నారు. మ‌రికాసేప‌ట్లో మంత్రులు బొత్స‌స‌త్య‌నారాయ‌ణ‌, వెల్లంప‌లి శ్రీ‌నివాస్ రామ‌తీర్థం కొండ‌పై విగ్ర‌హ ధ్వంసం ఘ‌ట‌నా స్థలాన్ని ప‌రిశీలించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి బాధ్యులైన వారిపై ఏపీ స‌ర్కార్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. రామ‌తీర్థం కోదండ‌రామాల‌యం ఈవో కిశోర్‌ను హెడ్ క్వార్ట‌ర్స్‌కి అటాచ్ ఎపి స‌ర్కార్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ‌రోవైపు .. ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు ను ఛైర్మ‌న్ ప‌ద‌వి నుంచి తొలగిస్తూ ఏపీ స‌ర్కార్ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *