అమ్మ‌లాంటి మాతృభాష‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉందన్నారు..

హైద‌రాబాద్‌: ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్యనాయుడు ఇప్పుడు చ‌ట్ట‌స‌భ‌లు నిర్మాణాత్మ‌క‌, ప్ర‌యోజ‌నాత్మ‌క చ‌ర్చ‌ల‌కు వేదిక‌లు కావాలేతప్ప‌…. అంత‌రాయాల‌కు కాద‌ని ఉప‌రాష్ట్రప‌తి అన్నారు.స‌మావేశాల స‌మ‌యంలో ప్ర‌జాప్ర‌తినిధుల హాజ‌రు బాగా త‌గ్గిపోయింద‌ని, కోరం కోసం చూడాల్సిన ప‌రిస్థితి రావ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు వ్య‌వ‌హ‌రించిన తీరుపై ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ ఎక‌నామిక్ అండ్ సోష‌ల్ స్ట‌డీస్ స‌మావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్ర‌ముఖ విద్యావేత్త‌, ప్ర‌తికాసంపాద‌కుడు, పార్ల‌మెంట్ మాజీ స‌భ్యుడు, ఉస్మానియా విశ్వ‌విద్యాల‌య మాజీ ఉప‌కుల‌ప‌తి నూక‌ల న‌రోత్త‌మ‌రెడ్డి శ‌త జ‌య‌తుంత్స‌వాల‌ను శ‌నివారం ఉప‌రాష్ట్రప‌తి ప్రారంభించారు. అమ్మ‌లాంటి మాతృభాష‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉందని… పార్ల‌మెంట్‌లో స‌భ్యుల‌కు 22 స‌భ్యుల‌కు 22 మాట్లాడే వెసులుబాటు క‌ల్పించిన‌ట్లు ఈ నేప‌థ్యంలో ఆయ‌న గుర్తు చేశారు. న‌రోత్త‌మ‌రెడ్డి శత‌జ‌యంతి నేప‌థ్యంలో ప్ర‌చురించిన పుస్తకాన్ని ఉప‌రాష్ట్రప‌తి ఆవిష్క‌రించారు. హోంమంత్రి మ‌హామూద్ అలీ, తెలంగాణ సారస్వ‌త ప‌రిషత్తు అధ్య‌క్షుడు ప్రొఫెస‌ర్ శివారెడ్డి, శ‌త జ‌యంత్యుత్స‌వ క‌మిటీ క‌న్వీన‌ర్ రాజేంద‌ర్‌రెడ్డి ,నూక‌ల‌న‌రోత్త‌మ‌రెడ్డి కుటుంబ‌స‌భ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *