మ‌హాభార‌తాన్ని త‌న క‌లంతో లిఖించిన వేద‌వ్యాసుడు…

వ్యాసుడు మ‌హాభార‌తానికి మూల‌పురుడు, కురు,పాండువుల‌కు బంధువు, త‌ల్లి ఆజ్ఞ‌మేర‌కు వంశాన్ని నిల్పినవాడు.త‌న మేద‌స్సుతో మ‌హాభార‌తాన్ని వ్రాస్తాడు, మ‌హాపురుషుడైనాడు.
ధ‌ర్మేచార్థేచ కామేచ మోక్షేచ పురుష‌ర్ష‌భ‌!
యాదిహాస్తి త‌ద‌న్య‌త్ర య‌న్నేహాస్తి న కుత్ర‌చిత్‌!!
వ్యాసుడు భార‌తంలో క‌నిపించ‌ని ధ‌ర్మార్థాది చ‌తుర్విధ పురుషార్థాలు వాటికి బ‌లాన్ని చేకూర్చే అంశాలు మ‌రెక్క‌డా క‌నిపించ‌ద‌ని చెప్తారు.
స‌మ‌స్త వేదాలు, ఉప‌నిష‌త్తుల జ్ఞాన ర‌హాస్యాల‌ను, అన్ని శాస్త్రాల సారాన్ని ఈ మ‌హాకావ్యంలో కూర్చి ర‌చించాన‌ని వేద‌వ్యాసుడు బ్ర‌హ్మ‌తో ఇలా అంటాడు…
బ్ర‌హ్మ‌న్‌! వేద ర‌హ‌స్యంచ య‌చ్చాన్య‌త్ స్థాపితం మ‌యా
సాంగోప‌నిష‌దాం చైవ వేదానం విస్త‌ర‌క్రియా
అన్ని ర‌హ‌స్యాల‌ను అంత‌ర్గ‌తంగా వ్య‌క్త‌ప‌రుస్తుంది కాబ‌ట్టి భార‌తానికి ఇంత ప్రాముఖ్య‌త ఉన్న‌ది.
మ‌హాభార‌త క‌ర్త వ్యాసుడు. ఆయ‌న వేద పుర‌ణేతిహాసాల‌కు క‌ర్త మాత్ర‌మే కాకుండా కురుపాండువ‌ల‌కు
బంధువుగా చెప్తారు. వ్యాసుడు స‌త్య‌వ‌తి-ప‌రాశ‌రుల పుత్రుడు. వారికి వ్యాసుడు ఒక ద్వీపంలో జ‌న్మించ‌డంవ‌ల్ల ఆయ‌న‌కు ద్వైపాయ‌నుడుఅనేపేరు క‌లిగింది. ఆయ‌న అస‌లు పేరు కృష్ణ అందుకే ఆచ‌ప కృష్ణ‌ద్వైపాయ‌నుడు.వేదాల‌ను విభ‌జించి వేద‌వ్యాసుడైనాడు. స‌ద్యోగ‌ర్భంలో జ‌న్మించిన వ్యాసుడు జ‌న్మ‌తః పండితుడైనాడు.మ‌హాభార‌తంలో ఎన్నో నేప‌థ్యంల్లో ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తాడు. పాండ‌వుల అర‌ణ్య‌వాసం నేప‌థ్యంలో అర్జునుని పాశుప‌తాస్త్రం కొర‌కు ప్ర‌య‌త్నించ‌మ‌ని కురుపాండ‌వ జ‌న‌నానికి .మూల‌పురుషుడై, వంశాన్ని ర‌క్షించ‌వ‌ల‌సిన అలాంటి నేప‌థ్యంలో వ్యాసుడు స‌త్య‌వ‌తి ఆజ్ఞ మేర‌కు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. మ‌హాభాత‌రంలో కురు, పాండ‌వ చ‌రిత్ర‌లోపాటు రాజ‌నీతి, అర్థ‌శాస్త్రం,ధ‌ర్మ‌శాస్త్ర‌, సంబంధ సంగ‌తాలు కూర్చ‌బ‌డ్డాయి. అందుకే మ‌హాభార‌తాన్ని స‌క‌ల శాస్త్ర సంగ్ర‌హంగా పేర్కొన్నారు. ఎన్నో మంచిమాట‌లు, నీతులు, ధ‌ర్మాలు బోధించ‌డంవ‌ల‌న సుభాషిత భండాగార‌మ‌ని, నీతుల‌ను నియ‌మ‌ని భార‌తాన్ని కొనియాడుతున్నారు.
వ్య‌క్తి స‌చ్చ‌రిత్ర క‌లిగి ఉండాల‌ని, వ్య‌క్తిత్వం కోల్పోయిన‌వాడు స‌మాజంలో గౌర‌వంగా జీవితాన్ని కొన‌సాగించ‌లేడ‌ని చెప్తుంది భార‌తం. దీనిలో దేవ‌త‌ల‌, ఋషుల‌, గంధ‌ర్వ‌ల, యక్షుల‌, రాక్ష‌సుల‌, చ‌క్ర‌వ‌ర్తుల‌, మాన‌వుల చ‌రిత్ర‌లు సంద‌ర్భానుకూలంగా ఉప‌దేశాత్మ‌కంగా ఉపాఖ్యానాల రూపంలో పొందుప‌ర్చ‌బ‌డిన‌వి. అంతేకాకుండా వ‌న‌,ప‌ర్వ‌త‌, న‌దీ, స‌ముద్ర‌, పుణ్య‌క్షేత్రాల మ‌హాత్మ్యాన్ని కూడా భార‌తం ఆవిష్క‌రించింది. ధార్మ‌క‌, శాస్త్రీయ‌, వైజ్ఞానిక సంగ‌తుల‌కు అనుకుల‌మైన భార‌తం ఒక విజ్ఞాన స‌ర్వ‌స్వం.
వేద‌వ్యాసుడు తాను ర‌చించిన మ‌హాభార‌తాన్ని సుమంతుడు, జైమిని, వైశంపాయ‌న ,శుకుల‌కు ప్రచారం
చేసే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాడు. జ‌న‌మేజ‌యుడు పాండ‌వ‌లు వంశానికి చెందిన‌వాడు. ఆయ‌న చేస్తున్న
స‌ర్ప‌యాగానికి వేద‌వ్యాసుడు వ‌చ్చాడు. పాండ‌వుల క‌థ‌ను వినిపించ‌మ‌ని జ‌న‌మేజ‌యుడు వ్యాసుని ప్రార్థించ‌గా వ్యాసుడు వైశంపాయ‌నునితో నీకు నేను చెప్పిన క‌థ‌ను చెప్ప‌మ‌ని ఆదేశించాడు. ఇలా జ‌న‌మేజ‌యుని సందేహాల‌ను నివృత్తి చేస్తూ వైశంపాయ‌నుడు క‌థ‌ను వివ‌రించాడు. బ‌హుశా ఈ నేప‌థ్యంలోనే జ‌యేతిహాసానికి భార‌తం అనే పేరు వ‌చ్చి ఉంటుంది.
వైదికయుగం త‌రువాత ఉన్న భార‌తీయ సంస్కృతిని మ‌హాభార‌తం తెలియ‌జేస్తుంది. వ్య‌క్తుల‌లోకి లోభం, ఈర్ష్య‌, అసూయ, రాజ్య‌కాంక్ష‌, ధార్మ‌క‌, సామాన్య ప్ర‌జ‌ల జీవితానుభవాల‌ను, ,చిత్రించ‌డం వ్యాసుడు భార‌తంలో అద్భుతంగా చిత్రించి య‌తోధ‌ర్మ‌స్త‌తో జ‌యః అన్న‌ట్లు ధ‌ర్మానికి విజ‌యం క‌లుగుతుంద‌నే ఒక ఉప‌దేశం వ్యాస‌భార‌తం ద్వారా భార‌తీయుల‌కు అందుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *