శ్రీ‌మ‌హావిష్ణువు వామ‌నావ‌తారం……

దేవ‌త‌ల‌కు అసురులు మ‌ధ్య యుద్ధం జ‌రిగింది. అమృతం కోసం కానీ అమృతం మొత్తం దేవ‌త‌ల‌కే ద‌క్కింద‌న్న కోపంతో అసురులు దేవ‌లోకం మీద యుద్ధం ప్ర‌క‌టించి అసురుల రాజైన బ‌లి చ‌క్ర‌వ‌ర్తి సారధ్యంలో ఇంద్ర‌లోకాన్ని వ‌శం చేసుకుని ఇంద్రుడ్ని త‌రిమిక‌ట్టారు. ఇంద్రుడు పోయి శ్రీ మ‌హావిష్ణువును ప్రార్థించ‌గా అత‌డికి అభ‌య‌మిచ్చి క‌శ్య‌పునికి అత‌ని భార్య అధితి గ‌ర్భాప వామ‌పావ‌తారుడై జ‌న్మించాడు. ఆ స‌మ‌యంలో లోకాల‌న్నింటిలో రాక్ష‌సాధికార‌మే కొన‌సాగాల‌ని బ‌లిచ‌క్ర‌వ‌ర్తి గొప్ప యాగం త‌ల‌పెట్టాడు. శ్రీ‌మ‌హావిష్ణువు వామ‌నావ‌తారం దాల్చ‌ట‌మే ఆల‌స్యం తండ్రిని వ‌డుగు చేయ‌మ‌ని కోరాడు. వామ‌నుడు విష్ణాంశ‌గా గ్ర‌హించిన క‌శ్య‌పుడు వెంట‌నే అత‌డికి ఉప‌న‌య‌న సంస్కారాల‌ను నిర్వ‌హించాడు.
ఉప‌న‌య‌న సంస్కార‌ము కావ‌ట‌మే త‌రువాయి బ‌లి చ‌క్ర‌వ‌ర్తి య‌జ్ఞస్థ‌లికి బ‌య‌లుదేరాడు. వామ‌నుడు. య‌జ్ఞ‌స్థ‌లికి వ‌చ్చిన వామ‌నుడిని చూసాడు బ‌లి చ‌క్ర‌వ‌ర్తి. ఒక చేతిన తాటాకుల ఛ‌త్రం….. మ‌రొక చేత్తో క‌మండ‌లం ప‌ట్టుకుని ఉన్నాడు. చంక‌లో జింక చ‌ర్మం ఉంది. మెడ‌లో మౌంజి.. య‌జ్ఞోప‌వీతం. త‌ల‌మీద పంచశిఖ‌లు…. బుల్లి కౌపీనం వేల్లాడు తోంది… చూడ‌గానే అర్థ‌మైపోయింది బ‌లికి ఆ వామ‌నుడికి క్రొత్త‌గా ఉప‌న‌యనం జ‌రిగింద‌ని.
బుల్లివామ‌నుడిని చూస్తూనే ముచ్చ‌ట‌ప‌డిపోయాడు. కొత్త్ర‌గా ఉప‌న‌యనం జ‌రిగిన‌ట్లుంది…. ఏంకావాలో కోరుకోఇస్తాను… అని వామ‌నుడిని చూస్తూ అన్నాడు బ‌లి.మూడ‌డుగుల స్థ‌లం చాలు. ఇప్పించు అన‌డిగాడు వామ‌నుడు. బ‌లి ఆశ్చ‌ర్య‌పోయాడు. ఇంత చిన్న దాన‌మా? అంటూ వామ‌నుడిని ప్ర‌శ్నించాడు. చాలు… నా అడుగుల‌తో మూడ‌డుగుల నేల చాలు!
స‌రే.. తీసుకో… అని దానం ఇవ్వ‌టానికి జ‌లం తెమ్మ‌ని భార్య‌కు చెప్పాడు.
రాక్ష‌గురువు శుక్ర‌చార్యుని మ‌న‌సు కీడు శంకించింది. వామ‌నుడిగా వ‌చ్చింది శ్రీ‌మ‌హావిష్ణువ‌ని గ్ర‌హించాడు. వెంట‌నే బ‌లి భార్య జ‌లం తెచ్చిన చెంబులో దూరి ఝారీ క‌న్నానికి అడ్డంగా త‌ల‌పెట్టి కూర్చున్నాడు.
దాన‌మివ్వ‌టానికి జ‌ల‌ధార పోసి చేయి త‌డ‌పాలి.. ఎంత వంచినా జ‌ల‌ధార రావ‌ట్లేదు. శుక్రాచార్యుని ఎత్తుగ‌డ గ‌మ‌నించాడు. శ్రీ‌మ‌హావిష్ణువు. ఒక ద‌ర్భపుల్ల‌తో క‌న్నంలోకి పొడిచాడు. అది పోయి శుక్రాచార్యుని క‌న్నులో దిగ‌బ‌డి గుడ్డివాడ్ని చేసింది.
బ‌లి నుండి మూడ‌డుగుల నేల‌ను దానంగా అందుకుని ఒక అడుగుతో.. భూమి….. మ‌రొక అడుగుతో ఆకాశాన్ని ఆక్ర‌మించేసాడు. శ్రీ‌మ‌హావిష్ణువు….
ఆ త‌రువాత చిరున‌వ్వుతో బ‌లివంక చూసి నీవు దానిమిచ్చిన‌ది మూడు అడుగులు రెండ‌డుగులు తీసుకున్నాను. మ‌రి మూడ‌వ అడుగేది.. అని అడ‌గగా..బ‌లి త‌న శిర‌స్సును చూపించాడు. శ్రీ‌మ‌హావిష్ణువు మూడో అడుగు బ‌లి నెత్తిన పెట్టి అత‌డిని పాతాళానికి అణ‌గ‌ద్రొక్కి దేవ‌గ‌ణాల‌కు… వారి లోకాల‌ను అప్ప‌గించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *