కాంగ్రెస్ అగ్ర‌కులాల పార్టీ -వి.హ‌నుమంత‌రావు

హైద‌రాబాద్ః కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత వి.హానుమంత‌రావు ఆ పార్టీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. పీసీసీ ఛీప్ ప‌ద‌వి విష‌యంలోసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ అగ్ర‌కులాల పార్టీ అయిపోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అవ‌త‌ల కేసీఆర్ బీసీ ,ఎస్సీ కులాల‌కు చెందిన వారికి అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెడుతున్నార‌ని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీలో బీసీ వ‌ర్గాల‌కు చెందిన సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టి రెడ్డి సామాజిక వ‌ర్గానికి అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వ‌డం దారుణ‌మ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ ప్యాకేజ్‌కు అమ్ముడు పోయాడ‌ని ఆరోపించారు. ఆర్ ఎస్ ఎస్ వ్య‌క్తి రేవంత్‌కు పీసీసీ చీఫ్ ఇస్తే తాను పార్టీలో కొన‌సాగ‌న‌ని స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *