ఉత్త‌రాఖండ్ చ‌మోలోజిల్లాలో వ‌ర‌ద భీవ‌త్సాన్ని స్వ‌యంగా ప‌రిశీస్తున్నా సీఎం

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖాండ్ లో వ‌ర‌ద భీవ‌త్సం జ‌న జీవితాన్ని స్తంభింప చేసింది. చ‌మోలో జిల్లాలో ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను స్వ‌యం స‌మీక్షించేందుకు ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి త్రివేంద్ర‌సింగ్ రావ‌త్ మంగ‌ళ‌వారంనాడు ఏరియ‌ల్ సర్వే జ‌రిపారు. జోషిమ‌ఠ్‌లోని ఐటీబీపీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిని క‌లుసుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ, సొరంగం నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌12 మంది ఆసుప్ర‌తిలో చికిత్స పొందుతున్నార‌ని, త్వ‌ర‌లోనే వారు కోలుకుంటార‌ని వైద్యులు తెలిపార‌ని చెప్పారు. కాగా, జ‌ల‌విల‌యంలో మృతుల సంఖ్య తాజాగా 26 కు చేరుగా, 171మంది జాడ ఇప్ప‌టికే తెలియ‌లేదు. స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. మ‌రో సొరంగంలో చిక్కుకున్న 35 మందిని ర‌క్షించేందుకు రెస్క్సూ ఆప‌రేష‌న్ రాత్రి నుంచి కొన‌సాగుతోంద‌ని,శిథిలాల తొల‌గింపు జ‌రుగుతోంద‌ని డీజీపీ అశోక్‌కుమార్ చెప్పారు. సాయంత్రానికి క‌ల్లా మార్గం క్లియ‌ర్ అవుతుంద‌ని ఆశిస్తున్న‌ట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *