కేంద్ర బ‌డ్జెట్ లో తెలంగాణ‌కు మొండి చేయి -ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి

హైద‌రాబాద్: కేంద్ర‌బ‌డ్జెట్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి చెత్త బ‌డ్జెట్ అంటూ విమర్శించారు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లసీత‌రామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ పై ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి సామన్య ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగక‌రంగా లేద‌ని బ‌డ్జెట్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది బ‌డ్జెట్ లేద‌ని .. త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న రాష్ట్రాల బ‌డ్జెట్‌లా ఉంద‌ని కాంగ్రెస్ మండిప‌డ్డారు. తెలంగాణ కు మొండి చేయి చూపించిన కేంద్ర స‌ర్కార్, తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం చేశార‌ని ధ్వంజ‌మెత్తారు. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, అస్సాం, బెంగాళ్ రాష్ట్రాల‌కు రూ.3 ల‌క్ష‌ల కోట్ల ప్రాజెక్టులు కేటాయించార‌న్న ఆయ‌న … అన్ని రాష్ట్రాల‌కు ద‌క్కాల్సిన సొమ్మును కొన్ని రాష్ట్రాల‌కే పంచుతున్నార‌ని విమ‌ర్శించారు. కేవ‌లం ఎన్నిక‌లున్న రాష్ట్రాల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌డం దుర్మార్గమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. 2 నెల‌ల‌కు పైగా ఆందోళ‌న‌లు చేస్తుంటే మ‌ద్ధ‌తు ధ‌ర‌పై ప్ర‌క‌ట‌న కూడా ఆయ‌న చేయ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.ఉన్న ఆస్తుల‌ను అమ్మ‌డం త‌ప్ప‌… కేంద్రం ఇంకేమీ చేయ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. బ‌డ్జెట్ పై తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నార‌ని… కానీ ఏమీ జ‌ర‌గ‌లేద‌ని ఉత్త‌మ్ కుమార్ తెలిపారు. రాష్ట్రానికి ద‌క్కింది బుడిద అని విమ‌ర్శించారు. ఖాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్ట‌రీ, బ‌య్యారం ఉక్కు క‌ర్మాగారం ,గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం మంజూరు చేయాల‌ని కేంద్రాన్ని కోర‌తామ‌ని ఆయ‌న చెప్పారు. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ రైల్వే లైన్‌తో పాటు బుల్లెట్ ట్రైన్ ఇవ్వాల‌ని ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. హైద‌రాబాద్ మెట్రోను విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని… ఆప్రాజెక్టుకు కూడా నిధులివ్వాల‌ని ఆయ‌న అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *