మ‌రో కీల‌క ప‌ద‌విలో భార‌త్ చెందిన వ్య‌క్తికి..

అగ్ర‌రాజ్యం అమెరికాలో భార‌త‌జాతికి చెందిన వ్య‌క్తులు ఎంతో మంది కీల‌క ప‌దవులు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే.కొత్త‌గా మ‌రో ఇండియా చెందిన అరుణ్ వెంక‌ట‌రామ‌న్ అనేక వ్య‌క్తికి కీల‌క ప‌దవికి బైడెన్ నామినేట్ చేశార‌ని తెలుస్తోంది. ఈ నిర్ణ‌యానికి సంబంధించి శ్వేత‌సౌధం ఒక ప్ర‌క‌ట‌న చేసింది. అమెరికా డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ అండు ఫారెన్ క‌మ‌ర్షియల్ స‌ర్వీస్‌, గ్లోబ‌ల్ మార్కెట్స్‌, డిపార్ట్మెంట్ ఆఫ్ కామ‌ర్స్ అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వికి వెంక‌ట‌రామ‌న్ పేరును సిఫార్స్ చేసిన‌ట్లు తెలిపింది. ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో పాటు అంత‌ర్జాతీయ వాణిజ్య స‌మ‌స్య‌ల‌ను సంబంధించిన అమెరికా ప్ర‌భుత్వానికి 20ఏళ్ల పాటు స‌ల‌హాదారునిగా కొన‌సాగిన ఆయ‌న ఇప్పుడు సెక్ర‌ట‌రీ ఆఫ్ కామ‌ర్స్ కౌన్సిల‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అక్క‌డ వాణిజ్య‌, ఇత‌ర అంత‌ర్జాతీయ ఆర్థిక ప‌ర‌మైన అంశాల‌కు సంబంధించిన శాఖ‌కు స‌ల‌హాలిస్తూ ఉంటారు. బైడెన్- హారిస్ యంత్రాంగంలో చేర‌డానికి ముందు ఆయ‌న వీసా డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *