యావ‌త్తు ప్ర‌పంచానికి ఇండియా ఆద‌ర్శంగా నిలిచింది..

న్యూయార్క్‌:గ‌త సంవ‌త్స‌రం క‌రోనా మ‌హ‌మ్మారి సామాన్య‌ప్ర‌జ‌ల‌ను చాలా ఇబ్బంది పెట్టిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా వ‌ల‌న ప్ర‌పంచం మొత్తం చేస్తున్న పోరాటంలో ఇండియా పోషిస్తున్న పాత్ర‌ను ఐక్య‌రాజ్య స‌మ‌తి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర‌స్ కొనియాడారు. ఈ విష‌యంలో ఇండియా గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ప్ర‌శంసించారు. ఐరాస శాంతిప‌రిర‌క్ష‌క దళానికి ఇండియా రెండు ల‌క్ష‌ల క‌రోనా టీకాల డోసులు ఉచితంగా అందిచ‌నున్న‌ట్లు విదేశాంగ మంత్రి జ‌య‌శంక‌ర్ ఈమ‌ద్య‌కాలంలో వెల్ల‌డించారు. ఐరాస లో భారత రాయ‌బారి టీఎస్‌.తిరుమూర్తి ఆదివారం ఉయ‌దం ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. క‌రోనా అంతానికి ఇండియా చేప‌డుతున్న గుటెర‌స్ లేఖ‌లో ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు. క‌రోనా వెలుగులోకి వ‌చ్చిన కొన్ని రోజుల నుంచి ప్ర‌పంచ దేశాల‌కు ఇండియా అందిస్తున్న సేవ‌ల్ని గుర్తుచేశారు. కీల‌క ఔష‌ధాలు, మెడిక‌ల్ కిట్లు, వెంటిలేట‌ర్లు వంటివి అందిస్తూ క‌రోనాపై పోరులో ఇండియా గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా వ్య‌వ‌హారిస్తోందని వ్యాఖ్యానించారు. క‌రోనా కాలంలో దాదాపు150 దేశాలు ఇండియా నుంచి ల‌బ్ది పొందిన‌ట్లు పేర్కొన్నారు. యావ‌త్తు ప్రపంచానికి అందుబాటులోకి వ‌చ్చిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇండియా త‌యారీ సామ‌ర్థ్యం వ‌ల్లే సాధ్య‌మైంద‌ని తెలిపారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈమ‌ధ్య కాలంలో అనుమ‌తులిచ్చింది. దీంతో ప్రపంచ‌వ్యాప్తంగా దీని వినియోగానికి మార్గం సుగ‌మ‌మైంది. అలాగే ప్రపంచ‌దేశాల‌కు స‌మానంగా క‌రోనా టీకా అందించాల‌న్న ఉద్దేశ్యంతో ఐరాస నేతృత్వంలో ఏర్పాటైన కొవాక్స్ బ‌లోపేతానికీ ఇండియా స‌హ‌క‌రిస్తోంద‌ని వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *