క‌రోనా టీపై అనుమానాలు అక్క‌ర్లేదు- ఆరోగ్య‌శాఖ‌మంత్రి

న్యూఢిల్లీ: క‌రోనా టీకాపై ఎలాంటి అనుమానాలు పెట్టుకొవ‌ద్ద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ అన్నారు. ఈ సందర్భంగా లోక్ స‌భ‌లోలో ఆరోగ్య‌శాఖ మంత్రి మాట్లాడాతూ, ఎలాంటి భ‌యం లేకుండా అంద‌రూ క‌రోనా టీకా వేయించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. దేశంలో ఇంత‌వ‌రకూ 3,93,39817 మంది వ్యాక్సిన్ వేయించుకున్న‌ట్టు తెలిపారు. కాగా, గ‌త 24 గంట‌ల్లో తాజాగా 39,726 కొవిడ్ కేసులు న‌మోదు కాగా, 20,624 మందికి స్వ‌స్థ‌త చేకూరిన‌ట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్ర‌వారంనాడు ప్ర‌క‌టించింది. తాజాగా వెలుగుచూసిన క‌రోనా కేసుల‌తో దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌1,15,14,331కు చేరుకుంది. వీటిలో 2,71,282 యాక్టివ్ కేసులుండ‌గా, 1,10,83,679 మంది కోలుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *