తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి స్వ‌ల్పంగా ఆదాయం….

హైద‌రాబాద్‌: ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తిచేస్తుంద‌ని తెలిసిన విష‌య‌మే. తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించించారు. దీని వ‌ల‌న అనేక ర‌కాలుగా ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌లు,రెక్క‌డితే డొక్క‌డాని ప్ర‌జానీకం న‌గ‌రంలో నివ‌సిస్తున్నారు. లాక్‌డౌన్ వేసిన‌ప్ప‌టికి కొంత సేపు లాక్‌డౌన్ స‌డ‌లింపు చేశారు. రోజు నాలుగు గంట‌ల సేపు ఈ స‌మ‌యంలో న‌గ‌రంలో ప్ర‌జ‌లు నిత్య‌వ‌స‌ర‌వ‌స్తువులు, చిన్న ఉద్యోగ‌స్తులు ఆఫీస్సుకు వెళ్ల‌డం వ‌లన న‌గ‌ర ఆర్టీసీకి స్వ‌ల్పంగా ఆదాయం పెరిగింది.ఇప్పుడు ఉద‌యం 6నుండి 10వ‌ర‌కు సిటీలో ఒక్క ట్రిపు మాత్ర‌మే బ‌స్సులను న‌డుపుతున్నారు. దీనివ‌ల్ల రోజుకురూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం వ‌స్తున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్ విధించిన మొద‌టి ప‌ది రోజుల‌లో కేవ‌లం రూ.10 నుండి 15ల‌క్ష‌ల మాత్ర‌మే రాబ‌డి వ్చింద‌ని, ఇప్పుడ‌ది రెట్టింపు అయింది. లాక్‌డౌన్ స‌మ‌యాల్లో మార్పులు చేస్తే క‌నీసం రెండు ట్రిప్పులు బ‌స్సులు తిప్ప‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని,దాని వ‌ల్ల ఆదాయం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందంటున్నారు. సాధార‌ణ స‌మ‌యంలో ఆర్‌టీసీ జీహెచ్ ఎంసీ జోన్ ప‌రిధిలో దాదాపు రూ.2.50 కోట్ల వ‌ర‌కు ఆదాయం ల‌భిస్తోంది. కాగా జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 29 డిపోల ప‌రిధిలో 2,700 వ‌ర‌కు ఆర్‌టీసీ బ‌స్సులు ఉన్నాయి. అయితే కొవిడ్ వ్యాప్తి సంద‌ర్బంలో కేసీఆర్ స‌ర్కారు లాక్‌డౌన్ విధించిన మొద‌టి రోజు నుండి దాదాపు 700 నుండి 800 బ‌స్సులు మాత్ర‌మే సిటీలో తిప్పుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *