మే1నుంచి ఇంట‌ర్మిడిట్ వార్షిక ప‌రీక్ష‌లు..

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇంట‌ర్మీడిట్‌ వార్షిక ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి స‌బితాఇంద్రారెడ్డి గురువారం విడుద‌ల చేశారు.మే1 నుంచి 19 వ‌ర‌కు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. మే2నుంచి 20 వ‌ర‌కు ఇంట‌ర్ సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ‌న్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏప్రిల్ 1 న ఎథిక్స్ అండ్ హ్యూమ‌న్ వ్యాల్యూస్ ప‌రీక్ష‌, ఏప్రిల్ 3న ఎన్విరాన్‌మెంట‌ల్ ఎడ్యుకేష‌న్ ప‌రీక్ష‌లు,ఏప్రిల్ 7నుంచి 20 వ‌ర‌కు ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్స్ ఉంటాయ‌ని ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది. ఇంట‌ర్ ఒకేష‌న‌ల్ కోర్సుల ప‌రీక్ష‌ల‌కూ ఇదే షెడ్యూల్ వ‌ర్తించ‌నుంది. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మే17 నుంచి నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *