మీడియాలో వ‌స్తున్న అస‌త్య ప్ర‌చారాల‌ను తీప్పికొట్టిన సీఎం…

హైద‌రాబాద్‌: సీఎం కేసీఆర్ వ‌చ్చేనేల ఏప్రిల్‌లో టీఆర్ఎస్ భారీగా బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. మీడియాలో వ‌స్తున్న గుస‌గుస‌లను ఆయ‌న తీప్పికొట్టారు.నేను ఆరోగ్యంగానే ఉన్నాన‌ని, ఇంకా ప‌దేళ్లు తానే సీఎంగా ఉంటాన‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టంచేశారు. కొత్త సీఎం అంటూ ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావ‌డం లేద‌ని అన్నారు.ఈనెల 12నుంచి పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు ప్రారంభించాల‌ని,మార్చి 1నుంచి పార్టీ క‌మిటీలు ఏర్పాటు ప్రారంభించాల‌ని నేత‌ల‌కు చెప్పారు. సీఎం మార్పుపై ఇక‌పై ఎవ‌రూ మాట్లాడొద్ద‌ని సూచించారు. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో రెండున్న‌ర గంట‌ల‌పాటు టీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి ఎవ‌రూ పోటీకాద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలు,వ‌ర‌గంల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్లు, నాగార్జునసాగ‌ర్ ఉప్ప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్సే గెల‌వాల‌ని కేసీఆర్ పార్టీ శేణుల‌కు సూచించారు. త్వ‌ర‌లో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు అన్ని క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. పార్టీ స‌భ్య‌త్వం విష‌యంలో ల‌క్ష్యాన్ని పూర్తిచేయాల‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *