మేం రైతులం ….సైనికులం అనేది ఇక మీద‌ట ఉద్య‌మం నినాదం…

ఢిల్లి: గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజు ఎర్ర‌కొట‌పై జెండా ఆవిష్క‌రించిన త‌రువాత రైతులు ట్రాక్ట‌ర్ ర్యాలీని నిర్వ‌హించారు. రైతులు శాంతియుతంగా నిర్వ‌హించిన ట్రాక్ట‌ర్ ర్యాలీని కొంద‌రు మ‌ధ్య‌వ‌ర్తులు కావాల‌నే హింసాత్మ‌క ఘ‌ట‌న ను సృష్టించార‌ని అంద‌రికి తెలిసిన విష‌య‌మే. సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లి స‌రిహ‌ద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్య‌మం 72 రోజుకు చేరుకుంది. శ‌నివారం జ‌రిగిన చుక్కాజామ్ నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన ప‌టిష్ట భ‌ద్ర‌త ఆదివార‌మూ కొన‌సాగుతోంది. ఆందోళ‌న‌ల‌కు కేంద్రంగా ఉన్న సింఘు, టిక్రీ, గాజీపూర్ స‌రిహ‌ద్దుల్లో పోలీసులు భారీ స్థాయిలో మోహ‌రించారు. మ‌రోవైపు చ‌ట్టాల్ని ర‌ద్దు చేసే వ‌ర‌కు ఉద్య‌మాన్ని ఆపాము అని రైతులు తేల్చి చెబుతున్నారు. మోదీ స‌ర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. త‌మ ఆందోళ‌న‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం నిర్వ‌హించిన చుక్కాజామ్ దేశ‌మంత‌టా ప్రశాంతంగా ముగిసింది. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలు వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని భార‌తీయ కిసాన్ యూనియ‌న్ జాతీయ అధికార ప్ర‌తినిధి, రైతు నేత రాకేష్ టికాయిత్ ప్ర‌క‌టించారు. చ‌ట్టాల ఉప‌సంహ‌ర‌ణ‌కు కేంద్ర స‌ర్కారుకు అక్టోబ‌ర్2 వ‌ర‌కు గ‌డుపునిస్తున్నట్లు తెలిపారు. మేం రైతులం.. సైనికులం అనేది ఇక మీద‌ట త‌మ ఉద్య‌మ నినాదంంగా ఉంటుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *