తిరుమ‌ల్లేషుడికి రికార్డు స్థాయిలో ఆదాయం..

తిరుప‌తిః తిరుమ‌ల‌లో వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని శ్రీ‌వారి ఆల‌యంలో నిన్న వైకుంఠ ద్వారాలు తెరుచుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంవ‌త్స‌రం 10రోజుల ‌పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాన్ని టీటీడీ క‌ల్పిస్తోంది. ఏకాంతంగా కైంక‌ర్యాలు, అభిషేకాది కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన అనంత‌రం 4గంట‌ల‌కు ప్రోటోకాల్ ప‌రిధిలోని ప్ర‌ముఖ‌ల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తించింది. టీటీడీ. ఉద‌యం 8గంట‌ల నుంచి ప్ర‌త్యేక‌, స‌ర్వ‌ద‌ర్శ‌నం టైం స్లాట్ టోకెన్ క‌లిగిన భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తించింది. కోవిడ్ ఆంక్ష‌లు నేప‌థ్యంలో ద‌ర్శ‌న టోకెన్లు వున్న భ‌క్తుల‌ను మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తున్నారు. అయితే నిన్ని రికార్డు స్థాయి లో శ్రీ‌వారికి హుండి ఆదాయం వ‌చ్చింది. లాక్‌డౌన్ త‌రువాత స్వామివారికి అత్య‌ధిక హుండి ఆదాయం స‌మ‌ర్పించారు. భ‌క్తులు. ఇవాళ హుండి శ్రీ‌వారికి4.3కోట్లు ఆదాయం వ‌చ్చింది. డిసెంబ‌ర్ మాసంలో ఇప్ప‌టికే ఐదుసార్లు శ్రీ‌వారి హుండి ఆదాయం 3 కోట్లు దాటింది. లాక్ డౌన్ అనంత‌రం ఇవాళ రికార్డు స్థాయిలో స్వామి వారిని ద‌ర్శించుకున్నారు భ‌క్తులు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకున్న భ‌క్తులు సంఖ్య 45 వేలు దాట‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *