నాలుగు రాష్ట్రాల‌లో శ‌ర‌వేగంగా కొత్త ర‌కం క‌రోనా వైర‌స్‌…

హైద‌రాబాద్ః తెలంగాణ‌లో శ‌ర‌వేగంగా కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తోంది. ఈ కొత్త వేరియంట్ కి శస్త్ర‌వేత్త‌లు ఎన్440కే ర‌కంగా నామ‌క‌ర‌ణం చేశారు. కొత్త ర‌కానికి కోవిడ్‌-19 యాంటీబాడీస్ నుంచి త‌ప్పించుకునే ల‌క్ష‌ణం ఉంద‌ని గుర్తించారు. ఏపీ నుంచి విశ్లేషించిన 272 కోవిడ్‌-19 శాంపిళ్ల జీనోమ్ విశ్లేష‌ణ‌లో 34% శాంపిళ్లలో ఎన్ 440కే ర‌కం గుర్తించారు. ఏపీలో అధికారులు. నోయిడాలోఒక కోవిడ్ రీ-ఇన్పెక్ష‌న్ కేసు గుర్తించారు.ఏపీతో పాటు క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌రాష్ట్రాల్లోనూ ఎన్ 440 కే ఉన్న‌ట్టు గుర్తించారు. వైద్యారోగ్యశాఖ అధికారులు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బ‌యోల‌జీ ప‌రిశోధ‌న‌ల్లో కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. భార‌త‌దేశంలో 6,370 జీనోమ్ విశ్లేష‌ణ జ‌ర‌ప‌గా ,2%లో ఎన్ 440కే ర‌కం మ్యుటేష‌న్ గుర్తించారు. జూలై -ఆగ‌స్టు నెల‌ల్లో ఆసియాలో ఎన్‌440 కే ర‌కం క‌రోనా వైర‌స్ ఆవిర్భవించింది. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా 5% జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాల‌ని కోవిడ్‌- ట‌స్క్‌ఫోర్స్ నిర్ణ‌యం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *