రాష్ట్ర స‌ర్కారు స‌డ‌లింపుల‌తో కూడిన క‌ఠిన లాక్‌డౌన్‌….

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మే 12 నుండి లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి కొన‌సాగుతున్న‌ది.సాయంత్రం 5గంట‌ల వర‌కు జ‌న సంచారాన్ని అనుమ‌తించాల‌ని యోచిస్తోంది. తెలంగాణ స‌ర్కారు స‌డ‌లింపుల‌తో కూడిన క‌ఠిన లాక్‌డౌన్ ను అమ‌లు చేయాల‌ని భావిస్తోంది. సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రేపు మ‌ధ్యాహ‌న్నం 2 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హించ‌నున్న మంత్రి మండ‌లి స‌మావేశంలో దీనిపై నిర్ణ‌యం తీసుకోనున్నారు. లాక్‌డౌన్ మూడో విడ‌త‌పై మే 30న మంత్రి మండ‌లి స‌మావేశ‌మైంది. ఉద‌యం 6గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌క వెసులుబాటు క‌ల్పించింది. ఆ త‌రువాత ఇళ్ల‌కు చేరుకునేందుకు మ‌రో గంట సేపు అనుమ‌తి ఇచ్చింది. మే31వ‌తేదీ నుండి ఇది అమ‌ల‌వుతోంది. ఇక మూడోవిడ‌త లాక్‌డౌన్ జూన్ 9వ తేదీతో ముగుస్తుండ‌డంతో త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ కోసం మంత్రి మండ‌లి మ‌రోసారి స‌మావేశ‌మ‌వుతోంది. ఇప్పుడు అమ‌లులో ఉన్న నిబంధ‌న‌ల‌తో దుకాణాలు, వ్యాపార స‌ముదాయాలు మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు న‌డుస్తున్నాయి. వ్యాపారాలు సాగుతున్నాయి. ఇప్పుడు క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న త‌రుణంలో ఆంక్ష‌ల‌ను మ‌రింత స‌డ‌లించాలని ప్ర‌భుత్వం భావిస్తోంది. అనుమ‌తి వేళ‌ల‌ను సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు పెంచి… ఇళ్ల‌కు తిరిగి వెళ్ల‌డానికి మ‌రోగంట అనుమ‌తించాల‌ని అనుకుంటోంది. రాత్రిపూట ప‌క‌బ్బంధిగా క‌ర్య్పూ అమ‌లు
చేయ‌నుంది. వివిధ కార్య‌క్ర‌మాలు ,ప‌థ‌కాలు అమ‌లు దృష్ట్యా ఆదాయం పెర‌గాల్సిన అవ‌స‌రం ఉండ‌డంతో లాక్ డౌన్ స‌డ‌లింపు అనివార్య‌మ‌ని భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *