ఉత్త‌మ్‌కుమార్ రెడ్డికి ఫోన్ చేసిన గ‌వ‌ర్న‌ర్‌

హైద‌రాబాద్‌: గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేశారు. కొవిడ్‌మ‌హ‌మ్మారి విల‌య‌తాడ‌వం చేస్తోన్న నేప‌థ్యంలో మున్పిప‌ల్ ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాలంటూ ఉత్త‌మ్ గ‌వ‌ర్న‌ర్ లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ఆయ‌న‌కు ఫోన్ చేశారు. ఫోన్‌లో మ‌రిన్ని వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంగ‌తిపై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంతో మాట్లాతాన‌ని ఉత్త‌మ్ కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై హామీ ఇచ్చారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి లేఖ రాసిన ఉత్త‌మ్ టీపీసీసీఅధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై కి నేడు లేఖ రాశారు. రాష్ట్రంలో కొవిడ్ తీవ్ర స్థాయిలో ఉంద‌ని, మున్సిపల్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ప్ర‌జ‌లు కొవిడ్ బారిన‌ప‌డ‌తారంటూ లేఖ‌లో పేర్కొన్నారు. ఈ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, ప్ర‌భుత్వ నిర్ణ‌యానికే రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కూడా త‌లొగ్గుతోంద‌ని ఉత్త‌మ్ ఫిర్యాదు చేశారు. ఇంత‌టి భ‌యాన‌క ప‌రిస్థ‌తుల్లో గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాల‌ని ,ఎన్నిక‌లు వాయిదా వేసి, ప్ర‌జ‌ల‌ను ర‌క్షించాల‌ని ఉత్త‌మ్ ఆ లేఖ‌లో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *