ఐటీ ఎగుమ‌తుల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుంది….

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిప‌థంలో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ఐటీ మినీస్టార్ క‌ల్వకుంట్ల తారక‌రామారావు సార‌థ్యంలో ఐటీ సంస్థ అభివృద్ధి ప‌థంలో న‌డుస్తోంది. ఐటీ ఎగుమ‌తుల్లో టీఎస్ రాష్ట్రం దూసుకుపోతున్న‌ది. జాతీయ సగ‌టును మించి వృద్ధిని న‌మోదు చేస్తున్న‌ది.ఈ ఆర్థిక ఏడాది(2020-2021) లో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు ఏడు శాతం పెరిగి రూ.1.4 ల‌క్ష‌ల కోట్ల‌కు చేర‌వ‌చ్చ‌ని నాస్కాం అంచ‌నా వేసింది. మ‌రోవైపు జాతీయ వృద్ధిరేటు స‌గ‌టు 1.9 శాతం ఉండ‌వ‌చ్చ‌ని తెలిసింది. దీనిపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ… ఐటీరంగంలో తెలంగాణ అద్భుత‌మైన వృద్ధిని సాధింస్తుంద‌న్నారు. 2013-14లో రూ 57 వేల 258 కోట్లుగా ఉన్న ఎగుమ‌తులు 2020-21 నాటికి రూ.ల‌క్షా 40 వేల‌కు చేరుకున్న‌ట్లు తెలిపారు. ఇది జాతీయ స‌గ‌టు కంటే చాలా ఎక్కువ అన్నారు. ఎన్డీయే ప్ర‌భుత్వం ఐటీఐఆర్‌ను ర‌ద్దు చేయ‌క‌పోయుంటే ఇంకా అధిక వృద్ధి, ఎక్కువ ఉపాధి అవ‌కాశాలు ల‌భించేవ‌న్నారు. ప్ర‌ధానిన‌రేంద్ర‌మోదీ , కేంద్ర ఐటీశాఖ మంత్రి కి ప్ర‌భుత్వ ప‌రంగా, వ్య‌క్తితంగా అనేక సార్లు అభ్య‌ర్థ‌న‌లు చేసిన‌ప్ప‌టికీ తెలియ‌ని కార‌ణాల‌తో కేంద్రం ఐటీఐఆర్‌ను ర‌ద్దు చేసింద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం డీపీఆర్‌, ఐటీ క్ల‌స్ట‌ర్ వివ‌రాల‌ను స‌మ‌ర్పించిన‌ప్ప‌టికి దుర‌దృష్ట‌వ‌శాత్తు కేంద్రం ఐటీఐఆర్‌ను ముందుకు తీసుకుపోలేద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *