బుధ‌వారం నుంచి 6,7,8 త‌ర‌గ‌తులు ప్రారంభం -ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌….

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో క‌రోనామ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త సంవ‌త్స‌రం మార్చి నుంచి విద్యాల‌యాలు మూత‌ప‌డ్డాయి. చాలా రోజు త‌రువాత కాలేజీలు ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ పాఠ‌శాల‌లు మాత్రం తెర‌చుకోలేదు. ఇక తెలంగాణ‌లో ఇప్ప‌టికే 9,10త‌ర‌గ‌తులు కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌ధ్యంలో మిగ‌తా త‌ర‌గ‌తులు చ‌దువుకునే విద్యార్థుల‌కు కూడా బ‌డులు తెర‌వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా కొత్త‌గా 6,7,8 త‌ర‌గ‌తుల‌ను ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.తెలంగాణ రేప‌టి నుంచి6,7,8 త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితాఇంద్రారెడ్డి తెలిపారు. అయితే రేప‌టి నుంచి మార్చి ఒక‌ట‌న తేదీ వ‌ర‌కు ఎప్పుడైనా త‌ర‌గ‌తుల‌ను ప్రారంభించుకోవ‌చ్చ‌ని ఆమె మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల‌కు అనుగుణంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించిన ఆమె కోవిడ్ మార్గద‌ర్శ‌క సూత్రాల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాలించాల‌ని, త‌ల్ల‌దండ్రుల అనుమ‌తి కూడా త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *