తెలంగాణ రాష్ట్రంలో 351క‌రోనా పాజిటివ్ కేసులు..

హైద‌రాబాద్ః రాష్ట్రంలో కొత్త‌గా 351 క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, ఇద్ద‌రు మ‌ర‌ణించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య‌2,89,784 కు చేర‌గా, 1565మంది మ‌ర‌ణించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 2,83,463 మంది బాధితులు క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. మ‌రో 4756 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, నిన్న కొత్త‌గా 415 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. 2584 మంది బాధితులు హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. దీంతో క‌రోనా రిక‌వ‌రీ రేటు 97.81శాతం మ‌ర‌ణాల రేటు 0.54శాతంగా ఉన్న‌ద‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. రాష్ట్రంలో నిన్న ఒకేరోజు 37451మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు 72,53,236 న‌మూనాల‌ను
ప‌రీక్షించామ‌ని వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. కొత్త న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 65కేసులు రంగారెడ్డి జిల్లాలో 30,మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాలో 28 చొప్పున ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *