కేబినెట్ లో ఉంటూ మంత్రులే దోపిడీ చేస్తున్నారు….

హైద‌రాబాద్‌: టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధికార పార్టీ నేత‌ల పేద‌ప్ర‌జ‌ల భూముల‌ను రాబందుల్లా తింటున్నార‌న్నారు. భూములు లాక్కోవ‌డానికే ప్ర‌జా ప్ర‌తినిధులైన‌ట్లు టీఆర్ ఎస్ వాళ్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. కేబినెట్‌లో ఉంటూ మంత్రులే దోపిడీ చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ విష‌యంలో కాంగ్రెస్ జిల్లా అధ్య‌క్షులు అత్యంత జాగ్ర‌త‌తో ఉంటూ టీఆర్ఎస్ పార్టీ నేత‌ల భూ అక్ర‌మాల వివ‌రాలు అందిచాల‌ని ఉత్త‌మ్ సూచించారు. భూముల విష‌యంలో తాము గ‌వ‌ర్న‌ర్ లేఖ రాస్తామ‌ని, భూముల దొంగ‌ల‌పై ఆధారాల‌తో స‌మా కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. టీఆర్ ఎస్ నేత‌ల భూక‌బ్జాల‌పై విచార‌ణ జ‌ర‌గాల‌ని ఉత్త‌మ్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *