ష‌ర్మిల‌పై రాజ‌కీయ రంగు పులుముతున్నారు….

హైద‌రాబాద్‌: సోమ‌వారం లోట‌స్ పాండ్‌లో మీడియాతో మాట్లాడిన దేవేంద‌ర్ రెడ్డి…. ష‌ర్మిల‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. విద్యార్థుల‌తో స‌మ్మేళ‌నంలో ఒక విద్యార్థి తండ్రి ని కోల్పోయాన‌ని బాధ‌ప‌డితే ష‌ర్మిల ఓదార్చార‌ని, దానికి రాజ‌కీయ రంగు పులుముతున్నార‌ని విమ‌ర్శించారు. ఆమె రాజ‌కీయం ఎదుగుతుండ‌డాన్ని రేవంత్‌రెడ్డి త‌ట్టుకోలేకపోతున్నార‌ని తూడి దేవేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ‌లో రోజులు లేవ‌న్నారు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పేరును రేవంత్ వాడుకోవాల‌ని అనుకున్నార‌ని మండిపడ్డారు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని ఇంత‌కుముందు దూషించి ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో పొగుడుతున్నారంటూ విమ‌ర్శించారు. త్రీకార్న‌ర్ పాలిటిక్స్ చేయాల్సిన అవ‌స‌రం ష‌ర్మిల‌కు లేద‌ని చెప్పారు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు సూరీడు వ్య‌క్తిగ‌తంగా ఎటువైపుఅయినా పోవ‌చ్చ‌ని దేవేంద‌ర్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *